584 కిలోమీటర్ల రేంజ్‌, కొత్త సేఫ్టీ ఫీచర్లు.. వోల్వో XC40 గురించి ఇంట్రెస్టింగ్‌ విషయాలివే

Volvo XC40 EX40 EC40.. ప్రీమియం కార్లలో సరికొత్త సాంకేతికతకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా Volvo తన 40-సిరీస్ మోడళ్లను అప్‌డేట్ చేసింది. XC40, EX40, EC40 కార్లలో డిజైన్ మార్పుల కంటే టెక్నాలజీ, AI, కనెక్టెడ్ ఫీచర్లు, భద్రతకు ప్రాధాన్యం ఇచ్చింది. 11.2 అంగుళాల డిస్‌ప్లే, Google Gemini AI, 3D 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

584 కిలోమీటర్ల రేంజ్‌, కొత్త సేఫ్టీ ఫీచర్లు.. వోల్వో XC40 గురించి ఇంట్రెస్టింగ్‌ విషయాలివే
Volvo Xc40 Ex40 Ec40

Updated on: Sep 15, 2026 | 6:10 AM

కారు అంటే కేవలం ఇంజిన్, డిజైన్ మాత్రమే కాదు.. ఇప్పుడు టెక్నాలజీ కూడా కీలకంగా మారింది. ఈ మార్పుకు అనుగుణంగా Volvo తన XC40, EX40, EC40 మోడళ్లలో కీలక అప్‌గ్రేడ్లు చేసింది. పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ నుంచి AI అసిస్టెంట్ వరకు ఎన్నో కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. సేఫ్టీ విషయంలోనూ కొత్త సెన్సర్లు, కెమెరాలను జోడించింది.

11.2 అంగుళాల స్క్రీన్.. Gemini AI!

కొత్త 40-సిరీస్ కార్లలో 11.2 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లేను అందించారు. కొత్త Volvo Car UXతో యాప్స్, ఇతర ఫీచర్లను తక్కువ ట్యాప్స్‌తో యాక్సెస్ చేసుకునేలా ఇంటర్‌ఫేస్‌ను మార్చారు. Google Gemini AI అసిస్టెంట్ ద్వారా వాయిస్ కమాండ్స్‌తో ప్రయాణాన్ని ప్లాన్ చేయడం, గమ్యస్థానం గురించి సమాచారం తెలుసుకోవడం, మెసేజ్‌లకు సంబంధించిన పనులు చేయడం వంటి అవకాశాలు ఉంటాయి.

ఎక్స్‌టీరియర్‌లోనూ కొన్ని మార్పులు చేశారు. Matrix LED హెడ్‌ల్యాంప్స్, కొత్త బంపర్, గ్రిల్, బోనెట్, ఫ్రంట్ వింగ్ డిజైన్ లభిస్తాయి. XC40, EX40 వెనుక భాగంలో కొత్త LED టెయిల్ ల్యాంప్స్, అప్‌డేటెడ్ టెయిల్‌గేట్, రియర్ బంపర్ ఉన్నాయి. కొత్త Black Edition ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది.

సేఫ్టీకి పెద్దపీట.. 584 కిలోమీటర్ల రేంజ్!

కొత్త ఫ్రంట్, కార్నర్ రాడార్లు, ఫ్రంట్ కెమెరా, రియర్ కార్నర్ రాడార్లు, అదనపు అల్ట్రాసోనిక్ సెన్సర్లతో భద్రతా వ్యవస్థను మెరుగుపరిచారు. అప్‌గ్రేడ్ చేసిన 360-డిగ్రీ కెమెరా 3D వ్యూను అందిస్తుంది. Pilot Assist, Lane Change Assist వంటి ఫీచర్లు కూడా లభిస్తాయి. పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే XC40లో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. లోయర్-స్పెక్ వెర్షన్ 163hp, 265Nm.. హయ్యర్-స్పెక్ వెర్షన్ 197hp, 300Nm శక్తిని అందిస్తుంది. 7-స్పీడ్ DCT గేర్‌బాక్స్ ద్వారా ముందు చక్రాలకు శక్తి చేరుతుంది.

EX40, EC40 పూర్తిగా ఎలక్ట్రిక్ మోడళ్లు. EC40 గరిష్టంగా 584 కిలోమీటర్ల వరకు WLTP రేంజ్ అందిస్తుంది. EX40 రేంజ్ 575 కిలోమీటర్ల వరకు ఉంటుంది. భారత్‌లో అందుబాటులో ఉండే వేరియంట్లు, ఫీచర్లు మార్కెట్‌ను బట్టి మారవచ్చు. ప్రస్తుతం EC40 భారత్‌లో 551 కిలోమీటర్ల వరకు WLTP రేంజ్‌తో లభిస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us