Vivo Y78 5G: భారతదేశ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో దశాబ్ద కాలపు చరిత్ర కలిగిన Vivo తన కస్టమర్ల కోసం కొత్త స్మార్ట్‌ఫోన్‌లను పరిచయం చేస్తుంటుంది. తన అద్భుతమైన ఫోన్లతో మార్కెట్‌లో మంచి ఆదరణను పొందగలిగింది. ఈ క్రమంలోనే వివో కంపెనీ భారత్‌లోని స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసం తన Vivo Y78 5G స్మార్ట్‌ఫోన్‌ను తీసుకు రాబోతోంది. మన దేశంలో Vivo Y78 5G స్మార్ట్‌ఫోన్ అక్టోబర్ నెలలో విడుదలవుతుందనే ప్రచారం జరగుతుండగా.. ఇప్పటికే చైనా మార్కెట్‌లో రాణిస్తున్న ఈ ఫోన్ ధర, ఫీచర్లు వంటి వివరాలు తాజాగా లీకయ్యాయి. మరి వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం..
Vivo Y78 5G ఫీచర్లు:
ఇప్పటికే చైనాలో విడుదలైన Vivo Y78 5G ఫోన్‌లో 6.78-అంగుళాల కర్వ్‌డ్ ఎడ్జ్ OLED డిస్‌ప్లే, రిజల్యూషన్ ఫుల్ HD ప్లస్, 120 Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో వస్తుంది. అయితే ఈ మోడల్‌లో 12/256GB, 8/256GB వేరియంట్‌ల్లో మాత్రమే అందుబాటులో ఉంది. కానీ ఈ స్మార్ట్‌ఫోన్ 8 GB వర్చువల్ ర్యామ్‌ని కూడా కలిగి ఉండడం విశేషం. అలాగే 5,000 mAh బ్యాటరీ బ్యాకప్, 44 W ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది. ఇక ఈ ఫోన్ Android 13 ఆధారిత FunTouch OS 13 పై రన్ అవుతుంది.
Vivo Y78 5G కెమెరా విషయానికొస్తే.. దీని వెనుక భాగంలో OIS సప్పోర్ట్‌తో 64 ఎంపీ ప్రైమరీ కెమెరా, 2-ఎంపీ డెప్త్ కెమెరా, 2-ఎంపీ మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16-ఎంపీ కెమెరా కూడా ముందుభాగంలో ఉంది. అలాగే సెక్యూరిటీ ఫీచర్‌గా ఫింగర్‌ప్రింట్ సెన్సార్(సైడ్) కూడా ఉంది.
భారత్‌లో Vivo Y78 5G ధర
డ్రీమీ గోల్డ్, ఫ్లేర్ బ్లాక్ కలర్ వేరియంట్స్‌తో వస్తున్న ఈ Vivo Y78 5G ఫోన్ ధరను దాని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే ఈ ఫోన్ ధర చైనాలో 8/256GB వేరియంట్ ధర CNY 1,699(సుమారు రూ. 20,100), 12/256GB వేరియంట్ ధర CNY 1,999(సుమారు రూ. 23,700)గా ఉంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..