ఈ మధ్య కాలంలో బీపీ, షుగర్ వ్యాధులు సర్వసాధారణం అయిపోయాయి. వీటిని నియంత్రించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మధుమేహ వ్యాధిగ్రస్తులు. ఈ క్రమంలో ప్రతి నెలకు, మూడు నెలలకు ఒక సారి షుగర్, బీపీ పరీక్షలు చేయించుకుంటూ ఉంటారు. దీని కోసం డయాగ్నోస్టి్క్ సెంటర్లను ఆశ్రయించి రక్తనమూనాలు ఇస్తూ ఉంటారు. వాటి ఫలితాల కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి. అయితే కేరళకు చెందిన వెర్సికల్స్ టెక్నాలజీస్ అనే స్టార్టప్ సంస్థ సరికొత్త యంత్రాన్ని ఆవిష్కరించింది. దీనిని డిజిటల్ హెల్త్ కియోస్క్ అని పేరు పెట్టింది. షుగర్, బీపీ, హార్గ్ అటాక్ సమస్యలను తక్షణమే గుర్తించేందుకు ఈ పరికరం ఉపయోగపడుతుంది. దీంతో గంటల తరబడి డయోగ్నోస్టిక్ సంస్థలపై ఆధారపడాల్సి పనిలేదు. దీనిని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రూపొందించినట్లు తెలిపారు. తక్కువ ధరకే దీనిని అందిస్తామంటోంది ఈ సంస్థ. అయితే నిర్థిష్టమైన ధరను ప్రకటించలేదు. ఇప్పటికే తమ సంస్థ వైర్‌లెస్ బ్లాటూత్ థర్మామీటర్, బాడీ వెయింగ్ మిషన్, ఈసీజీ మానిటరింగ్ డివైజ్‌లను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. దీంతోపాటూ వివిధ ఆరోగ్య సమస్యలకు సంబంధించిన పూర్తి డేటాను చాలా కాలంపాటూ ఇందులో భద్రపరిచి ఉంచవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..