Twitter: అంతరాయంపై స్పందించిన ట్విట్టర్.. అసౌకర్యానికి క్షమించాలని వేడుకోలు..

|

Feb 12, 2022 | 11:34 AM

Twitter: గత రాత్రి నుంచి ట్విట్టర్ సేవలకు అంతరాయం కలిగినట్లు యూజర్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ట్విట్టర్ వెంటనే సేవలను పునరుద్ధరించింది. సాంకేతిక

Twitter: అంతరాయంపై స్పందించిన ట్విట్టర్.. అసౌకర్యానికి క్షమించాలని వేడుకోలు..
Twitter
Follow us on

Twitter: గత రాత్రి నుంచి ట్విట్టర్ సేవలకు అంతరాయం కలిగినట్లు యూజర్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ట్విట్టర్ వెంటనే సేవలను పునరుద్ధరించింది. సాంకేతిక సమస్యల కారణంగానే సేవలకు అంతరాయం కలిగినట్టు తెలిపింది. యూజర్లకు కలిగిన అసౌకర్యానికి క్షమించాలని వేడుకుంది. ట్విటర్​ తిరిగి సేవలు ప్రారంభించగానే పలువురు యూజర్లు ట్రోల్ చేయడం ప్రారంభించారు. మొబైల్ మాత్రమే కాదు మైక్రోబ్లాగింగ్ సైట్ కూడా మొరాయించింది. లోడింగ్ సమస్య వల్ల పోస్టింగ్‌లు చేయలేకపోయామని లాగిన్ కూడా కాలేకపోయామని పలువురు కంప్లెయింట్ చేశారు. ట్విట్టర్‌ను ఉపయోగిస్తుండగానే మధ్యలోనే లాగౌట్ అయిందని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.

డౌన్​డిటెక్టర్​ ట్రాక్​ ప్రకారం సుమారు 48 వేలకు పైనే ఫిర్యాదులు అందినట్లు సమాచారం. శుక్రవారం రాత్రి 10.30 గంటల తర్వాత ట్విటర్‌ సర్వర్‌లో సమస్యలు ఎదురయ్యాయి. భారత్‌లో గంటపాటు ట్విటర్‌ సేవలకు అంతరాయం కలిగినట్లు సమాచారం. మొబైల్స్‌తో పాటు వెబ్‌సైట్‌లో కూడా ట్విటర్‌ పనిచేయలేదు. లోడింగ్‌ సమస్యతో పాటు లాగిన్‌ కూడా కాలేదని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. డౌన్‌డెటెక్టర్ దాదాపు 15 వేల మంది యూజర్‌ల అంతరాయాల నివేదికలను చూపించింది.

అతడు సెంచరీ చేసిన ప్రతిసారి భారత్‌ గెలిచేది.. ఆ మణికట్టు మాయాజాలం అద్భుతం..

IPL 2022: ఆ టీమిండియా ప్లేయర్ ధర పెరిగింది.. వేలంలోకి కొత్తగా మరో పదిమంది..?

Bananas: అరటిపండ్లు తొందరగా పక్వానికి రావొద్దంటే ఏం చేయాలి.. వీటిని పాటిస్తే చాలు..?