AI Cal Scanner: ఫేక్‌ వాయిస్‌లను ఇట్టే పట్టేస్తోంది.. ట్రూకాలర్‌ సరికొత్త ఏఐ ఫీచర్‌..

ప్రస్తుతం ఈ ఏఐ వాయిస్‌క్లోనింగ్‌ అనేది చాలా మందిని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ టెక్నాలజీ కేవలం మూడు సెకండ్ల ఆడియోతో ఎవరి వాయిస్‌ని అయినా అనుకరించడానికి అవకాశం ఇస్తుంది. దీంతో మోసగాళ్లు మన ప్రియమైన వారు, స్నేహితుల వాయిస్‌లతో సులభంగా మోసాలకు పాల్పడుతున్నారు. వారు బాధలో ఉన్నట్లు, డబ్బు అవసరమని చెప్పడం వంటివి చేస్తున్నారు.

AI Cal Scanner: ఫేక్‌ వాయిస్‌లను ఇట్టే పట్టేస్తోంది.. ట్రూకాలర్‌ సరికొత్త ఏఐ ఫీచర్‌..
Truecaller Ai Call Scanner

Updated on: Jun 01, 2024 | 7:23 PM

ప్రపంచం వేగంగా మారుతోంది. ఆధునిక సాంకేతిక శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ రోజు ఉన్న అప్‌డేట్‌ రేపు ఉండటం లేదు. అంతలా సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) ఆవిర్భావం తర్వాత ప్రపంచ స్వరూపమే మారిపోతోంది. అయితే ఇదే స్థాయిలో ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా సైబర్‌ నేరాలు పెరిగిపోతున్నాయి. అలాగే ఏఐతో దీప్‌ఫేక్‌, వాయిస్‌ క్లోనింగ్‌ స్కామ్లు వెలుగుచూస్తు‍‍న్నాయి. ప్రస్తుతం ఈ ఏఐ వాయిస్‌క్లోనింగ్‌ అనేది చాలా మందిని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ టెక్నాలజీ కేవలం మూడు సెకండ్ల ఆడియోతో ఎవరి వాయిస్‌ని అయినా అనుకరించడానికి అవకాశం ఇస్తుంది. దీంతో మోసగాళ్లు మన ప్రియమైన వారు, స్నేహితుల వాయిస్‌లతో సులభంగా మోసాలకు పాల్పడుతున్నారు. వారు బాధలో ఉన్నట్లు, డబ్బు అవసరమని చెప్పడం వంటివి చేస్తున్నారు. అయితే ఈ ముప్పును ప్రముఖ కాలింగ్‌ యాప్‌ ట్రూకాలర్‌ కొత్త సాధనాన్ని పరిచయం చేసింది. దాని పేరు ఏఐ కాల్‌ స్కానర్‌. ఇది ఎలా పనిచేస్తుంది? మోసాన్ని ఎలా నివారిస్తుంది? పూర్తి వివరాలను తెలుసుకుందాం..

స్వరాన్ని గుర్తిస్తుంది..

ట్రూకాలర్ యాప్‌ స్కామ్‌లను ఎదుర్కోవడంలో సమర్థంగా పనిచేస్తుంది. ఇప్పుడు కొత్తగా ఏఐ కాల్‌ స్కానర్‌ ను తీసుకొచ్చింది. ఇది వినియోగదారులకు నకిలీ కాల్‌లను గుర్తించడంలో సహాయపడుతుంది. ఈ కొత్త ఫీచర్ నిజమైన మానవ స్వరాలకు, ఏఐ రూపొందించిన స్వరాలకు మధ్య వ్యత్యాసాన్ని తెలియజేస్తుంది, ప్రజలు మోసపోకుండా ఉండటానికి సహాయపడుతుంది. ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉన్న ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ట్రూకాలర్ యాప్‌లో ఏఐ కాల్ స్కానర్ అందుబాటులో ఉంది. ఇది మొదటగా అమెరికాలో అందుబాటులోకి వచ్చింది. త్వరలో భారతదేశంతో పాటుఇతర ప్రధాన మార్కెట్‌లకు విస్తరించే అవకాశం ఉంది.

ఏఐ కాల్‌ స్కానర్‌ని ఎలా ఉపయోగించాలి..

ఏఐ కాల్ స్కానర్‌ని ఉపయోగించడం సులభం. మీకు అనుమానాస్పద కాల్ వస్తే, మీరు ట్రూకాలర్‌ యాప్‌లోని బటన్‌ నొక్కితే చాలు. ట్రూకాలర్ అధునాతన సాంకేతికత ద్వారా కాలర్ వాయిస్ రికార్డ్ చేస్తుంది. దానిని విశ్లేషిస్తుంది. కొన్ని సెకన్లలో, వాయిస్ నిజమైనదా లేదా నకిలీదా అని యాప్ మీకు తెలియజేస్తుంది. ఈ కచ్చితమైన సాధనం వినియోగదారులు స్కామ్‌ల నుంచి సురక్షితంగా ఉండటానికి సహాయపడుతుంది.

అంతర్నిర్మితంగానే..

ఈ ఫీచర్‌ గురించి ట్రూకాలర్‌ సీఈఓ సహ వ్యవస్థాపకుడు అలాన్ మామెడి మాట్లాఉడూ ఏఐ వాయిస్ స్కామ్‌లు సర్వసాధారణం అవుతున్న క్రమంలో తాము ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని కొనుగొన్నామన్నారు. ట్రూకాలర్ ఇప్పుడు అంతర్నిర్మిత ఏఐ వాయిస్ డిటెక్షన్‌ను కలిగి ఉన్న మొదటి యాప్ అని చెప్పారు. ఈ స్కామ్‌ల నుంచి రక్షిస్తుందని వివరించారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..