Facebook New Update: మీ మెసేజ్‌లో టైపింగ్ ఎర్రర్ వచ్చిందా.. ఇలా ఈజీగా ఎడిట్ చేసుకోండి..

|

Apr 04, 2024 | 5:21 PM

ఫేస్ బుక్ కు అనుసంధానం వ్యక్తిగత చాట్స్ కోసం మెసెంజర్ యాప్ అందుబాటులో ఉంటుంది. కేవలం ఇద్దరి మధ్య సంభాషణకు ఇది ఉపయోగపడుతుంది. అయితే ఒక్కోసారి అనుకోకుండా తప్పుగా టైప్ చేసి, పోస్టు చేసేస్తాం. తర్వాత చదివితే ఆ తప్పు స్పష్టంగా తెలుస్తుంది. కానీ దానిని డిలీట్ చేయడం ఎలాగో తెలియదు. అప్పుడు చాలా ఆందోళనకు గురవుతాం. ఈ క్రమంలో ఫేస్ బుక్ కొత్త అప్ డేట్ తీసుకొచ్చింది.

Facebook New Update: మీ మెసేజ్‌లో టైపింగ్ ఎర్రర్ వచ్చిందా.. ఇలా ఈజీగా ఎడిట్ చేసుకోండి..
Facebook
Follow us on

ప్రపంచంలో ప్రజలందరినీ ఏకం చేసే కమ్యునికేషన్ వ్యవస్థ ఫేస్ బుక్. విభిన్న ప్రాంతాలలో ఉన్న వ్యక్తులు, అక్కడి భౌతిక పరిస్థితులు, వాతావరణం, చిత్రాలు, విచిత్రాలు ఇవన్నీతెలుసుకునే సాధనం. వివిధ దేశాల్లోని ఎందరో మిత్రులు దీని ద్వారా మనకు పరిచయం అవుతారు. వారి ఆనందాలు, అభిప్రాయాలను పంచుకుంటారు. మనం కూడా ఫేస్ బుక్ లో మన విషయాలను, అభిప్రాయాలను పంచుకుంటాం. పెళ్లిళ్లు, పుట్టిన రోజులు, శుభకార్యాలు, ఇతర సంఘటలను పోస్టు చేస్తుంటాం. ఫేస్ బుక్ కు అనుసంధానం వ్యక్తిగత చాట్స్ కోసం మెసెంజర్ యాప్ అందుబాటులో ఉంటుంది. కేవలం ఇద్దరి మధ్య సంభాషణకు ఇది ఉపయోగపడుతుంది. అయితే ఒక్కోసారి అనుకోకుండా తప్పుగా టైప్ చేసి, పోస్టు చేసేస్తాం. తర్వాత చదివితే ఆ తప్పు స్పష్టంగా తెలుస్తుంది. కానీ దానిని డిలీట్ చేయడం ఎలాగో తెలియదు. అప్పుడు చాలా ఆందోళనకు గురవుతాం. ఈ క్రమంలో ఫేస్ బుక్ కొత్త అప్ డేట్ తీసుకొచ్చింది. మెసెంజర్లో పంపిన మెసేజ్ ఎడిట్ చేసుకొనే వెసలుబాటు కల్పించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

కొత్త అప్ డేట్..

మెసెంజర్లో తప్పుగా పంపిన మెసేజెస్ ను ఎడిట్ చేసుకునేందుకు మెటా యాజమాన్యం కొత్త అప్ డేట్ ను తీసుకొచ్చింది. దీని సాయంతో తప్పుగా రాసిన సందేశాన్ని దీని ద్వారా చాలా సులువుగా సరిచేయవచ్చు. ఫేస్ బుక్ వాడుతున్న ప్రతి ఒక్కరికీ ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. మెటా తీసుకువచ్చిన కొత్త అప్ డేట్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలో అందుబాటులో ఉంది. దీనిని ఉపయోగించుకోవాలంటే ముందుగా మెసేంజర్ యాప్ ను తాజా వెర్షన్ కు అప్ డేట్ చేసుకోవాలి. అప్పుడు మీకు అందుబాటులోకి వస్తుంది. దీని ద్వారా మెసెంజర్ లోని సందేశాన్ని 15 నిమిషాలలోపు సవరించవచ్చు. వాట్సాప్, టెలిగ్రామ్ మాదిరిగానే ఫేస్ బుక్ లోనూ ఈ అవకాశం ఉంది.

సందేశాన్ని ఎడిట్ చేసే విధానం..

  • ఎఫ్ బీ మెసెంజర్ లో సందేశాన్ని సవరించడం అనేది చాలా సులవైన ప్రక్రియ.
  • ముందుగా మీరు చేసిన చాట్ లేదా మెసేజ్ లోకి వెళ్లండి.
  • దానిని లాంగ్ ప్రెస్ చేయండి.
  • అప్పుడు వచ్చిన ఆప్షన్లలో నుంచి ఎడిట్ ఆప్షన్ ఎంచుకోండి. మీరు చేసిన తప్పును సవరించండి.
  • ఒక సందేశాన్ని ఇలా ఐదుసార్లు సవరించే అవకాశం ఉంది.
  • అయితే మీరు సందేశం పంపిన 15 నిమిషాల్లోనే అది ఎడిట్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలి.

అనేక ఫీచర్లు..

ఎడిట్ చేసిన తర్వాత అదే మెసేజ్ దిగువన స్పష్టంగా కనిపిస్తుంది. మీరు పంపిన సందేశాన్ని15 నిమిషాలలోనే సవరించగలరు. తర్వాత కుదరదు. ఒకసారి సవరించిన తర్వాత, మెసేజ్ దానికదే అప్ డేట్ అవుతుంది. మీరు పంపిన మెసేజ్ ను ఇప్పటికే చూసిన వారికి కూడా సవరించిన మెసేజ్ కనిపిస్తుంది. మెసేజ్‌ను బంపింగ్ చేయడం వంటి ఫీచర్లు కూడా మెసెంజర్‌లో ఉన్నాయి. వినియోగదారుని బ్లాక్ చేయకుండా వారికి మెసేజ్ వెళ్లకుండా నిరోధించవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..