Myntra Diwali sale: ఈ స్మార్ట్ వాచ్‌లు తోడుంటే నో టెన్షన్..ఆకట్టుకుంటున్న ఫీచర్లు..!

|

Oct 24, 2024 | 4:45 PM

దీపావళికి కొత్త వస్తువులను కొనుగోలు చేయడం మన దేశంలో సంప్రదాయం. పండగ ఆనందం గుర్తుండిపోయేలా ద్విచక్ర వాహనాలు, కార్లను, ఇంట్లోని అవసరమైన ఎలక్ట్రానిక్స్ వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈసారి పండగకు సరికొత్తగా ఆలోచన చేయండి. మీ స్లైల్ తో పాటు ఫిట్ నెస్ పెంచుకునేందుకు, ఆరోగ్యంపై శ్రద్ద చూపేలా స్మార్ట్ వాచ్ లను కొనుగోలు చేయండి.

Myntra Diwali sale: ఈ స్మార్ట్ వాచ్‌లు తోడుంటే నో టెన్షన్..ఆకట్టుకుంటున్న ఫీచర్లు..!
Smart Watch
Follow us on

మింత్రా దీపావళి సేల్ ప్రస్తుతం లైవ్‌లో ఉంది. ఈ సేల్‌లో ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్ వాచ్ లు అందుబాటు ధరలలో ఉన్నాయి. ముఖ్యంగా మునుపెన్నడూ లేని తగ్గింపు ధరలు స్మార్ట్‌వాచ్‌లపై అందిస్తున్నారు. అలాగే  ఎంపిక చేసిన బ్యాంకు ఆఫర్ల ద్వారా మరో పదిశాతం డిస్కౌంట్ లభిస్తుంది. స్మార్ట్ వాచ్‌ల వినియోగం పెరిగిన దృష్ట్యా యువత ప్రస్తుతం ఈ సేల్‌పై ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా గతంలో ఏ సేల్‌లో లేని మోడల్స్‌పై ఈ సేల్‌లో డిస్కౌంట్‌లు అందించడంతో కొనుగోలుకు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో మింత్రా దీపావళి సేల్ లో అందుబాటులో ఉన్న స్మార్ట్‌వాచ్‌ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

పెబుల్ హైవ్

ఉత్తమ టెక్నాలజీ, సొగసైన డిజైన్ తో రూపొందించిన పెబుల్ హైవ్ స్మార్ట్ వాచ్ ఎంతో ఆకట్టుకుంటోంది. దీనిలో వైబ్రెంట్ 1.39 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లేతో విజువల్స్ చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఫ్యూచరిస్టిక్ ఆక్టా డిజైన్, బ్లూటూత్ కాలింగ్ ఎంతో ప్రయోజనంగా ఉంటాయి. హార్ట్ బీట్, ఎస్వీఓ2 స్థాయిలను పర్యవేక్షించుకోవచ్చు. వ్యాయామం చేసుకోవడానికి వివిధ మోడ్ లు, డీఐవై వాచ్ ఫేసెస్, ఇన్ బిల్ట్ గేమ్ లు, ఇంటర్నేషనల్ టైమింగ్, అలారం, క్యాలెండర్ తదితర ఫీచర్లు ఏర్పాటు చేశారు. ఈ స్మార్ట్ వాచ్ పై ఒక ఏడాది వారంటీ కూడా లభిస్తుంది. మింత్రా దీపావళి సేల్ లో రూ.1,699కి ఈ వాచ్ ను కొనుగోలు చేయవచ్చు.

నాయిస్ కలర్ ఫిట్

నిత్యం మీకు ఉపయోగపడే వివిధ ఫీచర్లు ఈ వాచ్ లో ఉన్నాయి. 1.69 అంగుళాల డిస్ ప్లే, ట్రూ సింక్ టెక్నాలజీ ఆకట్టుకుంటున్నాయి. ప్రయాణ సమయంలో బ్లూటూత్ కాలింగ్ తో చాలా ఉపయోగం ఉంటుంది. హ్యాండ్ వాష్ రిమైండర్లు, వాతావరణ హెచ్చరికలు, అలారం తదితర ఫీచర్లు ఏర్పాటు చేశారు హార్ట్ బీట్, బ్లడ్, ఆక్సిజన్ స్థాయిలు, నిద్ర, ఒత్తిడిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవచ్చు. 150కి పైగా వాచ్ ఫేస్లు, ఐపీ 68 వాటర్ రెసిస్టెన్స్ అదనపు ప్రత్యేకతలు. ఏడాది వారంటీ కలిగిన నాయిస్ కలర్ ఫిట్ పల్స్ గో బజ్ స్మార్ట్ వాచ్ మింత్రా లో రూ.1,749కి అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

బోట్ లునార్ ఫిట్

ఆరోగ్య పర్యవేక్షణ ఫీచర్లు, వివిధ స్పోర్ట్ మోడ్ లు కలిగిన బోట్ లునార్ ఫిట్ స్మార్ట్ వాచ్ తో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. 1.43 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే, బ్లూటూత్ కాలింగ్, 400 ఎంఏహెచ్ బ్యాటరీ ఆకట్టుకుంటున్నాయి. దీనిలోని వివిధ స్టోర్ట్ మోడ్ లలో మీ ఫిట్ నెస్ ను మెరుగుపర్చుకోవచ్చు. దుమ్ము, చెమట తదితర వాటి నుంచి ఐపీ 67 రేటింగ్ కలిగిన వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ కాపాడుతుంది. పైన మాదిరిగానే ఒక ఏడాది వారంటీ అందిస్తున్నారు. మింత్రా దీపావళి సేల్ లో ఈ స్టార్ట్ వాచ్ ను రూ.2,199కి కొనుగోలు చేసుకోవచ్చు.

రియల్ మీ ఎస్ 2

స్టైల్, టెక్నాలజీ ని కొరుకునే వారికి రియల్ మీ ఎస్ 2 స్టార్మ్ వాచ్ చక్కగా సరిపోతుంది. 1.43 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ ప్లే తో స్క్రీన్ లో స్పష్టత ఉంటుంది. చాట్ జీపీటీ 3.5 మద్దతుతో మీరు కాల్స్ కు సమాధానాలు ఇవ్వవచ్చు. దాదాపు 8 నుంచి 13 రోజుల వరకూ బ్యాటరీ పని చేస్తుంది. నీరు, దుమ్ము నుంచి రక్షణకు ఐపీ68 వాటర్ రెసిస్టెన్స్ తో పాటు హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు ఏర్పాటు చేశారు. ఏఐ టెక్నాలజీ తో ఫిట్ నెస్ ను పెంచుకునే అవకాశం ఉంది. ఈ స్టార్మ్ వాచ్ కు ఒక ఏడాది వారంటీ ఇస్తున్నారు. మింత్రా దీపావళి సేల్ లో రూ.4,499కి సొంతం చేసుకోవచ్చు.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి