WhatsApp New Feature: వాట్సాప్‌లో మరో అద్భుత ఫీచర్.. చిటికెలో చాట్ డేటా బదిలీ.. అదెలా అంటే..

కొత్త ఫోన్ తీసుకున్న ఆనందంలో ఉన్నప్పటికీ పాత ఫోన్ నుంచి చాట్ డేటాను కొత్త ఫోన్ లోకి బదిలీ చేయడం కొంత ఇబ్బందిగా ఉంటుంది. ముందుగా మన డేటాను గూగుల్ డ్రైవ్ కు బదిలీ చేసి, మళ్లీ దానిని కొత్త ఫోన్ లోకి ట్రాన్స్ ఫర్ చేయాలి. ఈ ప్రక్రియ వల్ల సమయం ఎక్కువ పడుతుంది. వాట్సాప్ ఇప్పుడు కొత్త గా తీసుకువచ్చిన ఫీచర్ తో ఆ ఇబ్బందులు ఉండవు.

WhatsApp New Feature: వాట్సాప్‌లో మరో అద్భుత ఫీచర్.. చిటికెలో చాట్ డేటా బదిలీ.. అదెలా అంటే..
Whatsapp
Follow us

|

Updated on: Jun 22, 2024 | 5:23 PM

ప్రముఖ మేసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త రకాల ఫీచర్లతో దూసుకుపోతోంది. తన యూజర్లకు మరింత మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. దీనిలో భాగంగా ఇప్పటికే అనేక ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. యూజర్లు సులభంగా, సమర్థవంతంగా యాప్ సేవలు పొందేందుకు ఈ చర్యలు తీసుకోంటోంది. ఇప్పుడు మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా క్యూాాాఆర్ కోడ్ ను ఉపయోగించి, ఫోన్ల మధ్య వాట్సాప్ చాట్ ను బదిలీ చేయవచ్చు.

చాలా ఈజీగా చాట్ డేటా బదిలీ..

సాధారణంగా మనం ఫోన్లను మార్చుతూ ఉంటాం. పాత ఫోన్ పాడైపోవడం, సరిగ్గా పనిచేయకపోవడం, అలాగే మార్కెట్ లోకి కొత్త ఫోన్ రావడం తదితర కారణాలతో ఈ మార్పు జరుగుతూ ఉంటుంది. కొత్త ఫోన్ తీసుకున్న ఆనందంలో ఉన్నప్పటికీ పాత ఫోన్ నుంచి చాట్ డేటాను కొత్త ఫోన్ లోకి బదిలీ చేయడం కొంత ఇబ్బందిగా ఉంటుంది. ముందుగా మన డేటాను గూగుల్ డ్రైవ్ కు బదిలీ చేసి, మళ్లీ దానిని కొత్త ఫోన్ లోకి ట్రాన్స్ ఫర్ చేయాలి. ఈ ప్రక్రియ వల్ల సమయం ఎక్కువ పడుతుంది. వాట్సాప్ ఇప్పుడు కొత్త గా తీసుకువచ్చిన ఫీచర్ తో ఆ ఇబ్బందులు ఉండవు. క్యూఆర్ కోడ్ ను ఉపయోగించి చాలా సులభంగా చాట్ డేటాను బదిలీ చేసుకోవచ్చు.

ఎంతో ఉపయోగం..

గూగుల్ డిస్క్ అవసరాన్ని తొలగిస్తూ, ఫోన్ల మధ్య చాట్ డేటా బదిలీకి కొత్త ఫీచర్ చాలా ఉపయోగంగా ఉంటుంది. దీనిలో భాగంగా క్యూఆర్ కోడ్ ఆధారిత ఫీచర్ ను వాట్సాప్ డెవలప్ చేసింది. కొత్త చాట్ బదిలీ కార్యాచరణ తాజా బీటా వెర్షన్ 2.24.9.19లో అందుబాటులో ఉంది.

క్యూఆర్ కోడ్ స్కాన్ తో..

కొత్త పరికరంతో ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా పాత ఫోన్ లోని చాట్ డేటా చాలా సులువుగా బదిలీ అవుతుంది. ఫోన్లను మార్చినప్పుడు డేటాను బ్యాకప్ చేయడానికి, పునరుద్ధరించడానికి గూగుల్ డిస్క్ పై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. దీని ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు ఎదుర్కొంటున్న ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

అస్పష్టత..

కొత్త క్యూఆర్ కోడ్ ఫీచర్ కు సంబంధించి కొన్ని సందేహాలు కూడా ఉన్నాయి. డేటా బదిలీ సమయంలో రెండు పరికరాలనూ వాట్సాప్ కు లాగిన్ చేయాలా లేకపోతే క్యూఆర్ కోడ్ విధానంలో కొత్త పరికరంలో సైన్-ఇన్ మెకానిజమ్‌గా పనిచేస్తుందా అనేది అస్పష్టంగానే ఉంది.

మరికొంత సమయం..

వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపిన వివరాల ప్రకారం.. బీటా ప్రోగ్రామ్‌లో ఇప్పటికే నమోదు చేసుకున్న వారికి క్యూఆర్ కోడ్ చాట్ బదిలీ ఫీచర్ గూగుల్ ప్లే స్టోర్ ద్వారా అందుబాటులో ఉంది. అయితే కొత్త వినియోగదారులు మాత్రం ఫీచర్ మరింత విస్తృతంగా విడుదలయ్యే వరకు వేచి ఉండాలి. వాట్సాప్ పబ్లిక్ వెర్షన్‌లోకి ఈ ఫంక్షనాలిటీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే దానిపై కూడా స్పష్టత లేదు.

త్వరలో అందుబాటులోకి..

క్యూఆర్ కోడ్ ఆధారిత బదిలీ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వివిధ ప్లాట్‌ఫాంలలో చాట్ హిస్టరీని బదిలీ చేయడానికి ఈ ఫీచర్‌ని యూనివర్సల్ సొల్యూషన్‌గా మార్చేందుకు వాట్సాప్ కృషి చేస్తోంది. ప్రస్తుతం ఐవోఎస్, ఆండ్రాయిడ్ పరికరాల మధ్య చాట్ డేటాను బదిలీ చేయడం కోసం ప్రత్యేక విభాగాన్ని యాక్సెస్ చేయడం లేదా ఫిజికల్ కేబుల్‌ని ఉపయోగిస్తున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!
చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!
మనదేశంలోని ఈ పర్వతాలపై ట్రెక్కింగ్ చాలా కష్టం..! ఒక సాహసయాత్రే..
మనదేశంలోని ఈ పర్వతాలపై ట్రెక్కింగ్ చాలా కష్టం..! ఒక సాహసయాత్రే..
వాయమ్మో.! వంటలక్క ఆస్తులు ఇన్ని కోట్లా.? విలువ ఎంతో తెలిస్తే
వాయమ్మో.! వంటలక్క ఆస్తులు ఇన్ని కోట్లా.? విలువ ఎంతో తెలిస్తే
ఆ రాశుల వారికి అధికార, గృహ, ఉద్యోగ యోగాలు
ఆ రాశుల వారికి అధికార, గృహ, ఉద్యోగ యోగాలు
లక్ష్యం ఒక్కటే.. కబ్జా చేస్తే ఊరుకునేదీ లేదుః రంగనాథ్
లక్ష్యం ఒక్కటే.. కబ్జా చేస్తే ఊరుకునేదీ లేదుః రంగనాథ్
బిగ్ బాస్ లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. ఇక ఆ ఇద్దరు బయటికే!
బిగ్ బాస్ లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. ఇక ఆ ఇద్దరు బయటికే!
బెస్ట్ ఆఫీస్ చైర్లపై భారీ ఆఫర్లు.. ఏకంగా 67శాతం వరకూ తగ్గింపు..
బెస్ట్ ఆఫీస్ చైర్లపై భారీ ఆఫర్లు.. ఏకంగా 67శాతం వరకూ తగ్గింపు..
హైదరాబాద్ హైటెక్ సిటీలో హెచ్‌సీఎల్ కొత్త క్యాంపస్ ప్రారంభం
హైదరాబాద్ హైటెక్ సిటీలో హెచ్‌సీఎల్ కొత్త క్యాంపస్ ప్రారంభం
మహేష్ బాబు మావయ్య ఓ క్రికెటర్.. సునీల్ గవాస్కర్‌తో ఆడారు..
మహేష్ బాబు మావయ్య ఓ క్రికెటర్.. సునీల్ గవాస్కర్‌తో ఆడారు..
బిస్కెట్లు ఎలా తయారుచేస్తారో చూస్తే షాక్ అవుతారు!
బిస్కెట్లు ఎలా తయారుచేస్తారో చూస్తే షాక్ అవుతారు!