పుట్టుకతో అంధులూ ఇక ప్రపంచాన్ని చూడొచ్చు..!

24 September 2024

TV9 Telugu 

ప్రపంచం ఎన్నో కొత్త ఆవిష్కరణలతో టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి చెందుతుంది. తాజాగా మరో అద్భుత ఆవిష్కరణకి పనులు మొదలయ్యాయి.

పుట్టుకతోనే అంధులైన వారు.. లేదా ఏదైనా కారణంతో మధ్యలో చూపు కోల్పోయిన వారి లోకాన్ని చూడాలనే కోరిక నెరవేరనుంది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న పుట్టుకతోనే అంధులైన వారికి చూపును ప్రసాదించే అరుదైన ప్రయోగానికి రంగం సిద్ధమయ్యింది.

బ్రెయిన్ చిప్‌తో సంచలనం సృష్టించిన ఎలాన్ మస్క్‌కు చెందిన న్యూరాలింగ్ ఈ ప్రయోగాన్ని చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఈ అరుదైన ప్రయోగానికి సంబంధించి అమెరికా అధికార యంత్రాంగం నుంచి ఎలాన్ మాస్క్ న్యూరాలింక్ అనుమతులు పొందింది.

బ్లైండ్ సైట్ డివైజ్ ద్వారా పుట్టుకతో అంధులైన వారు కూడా ప్రపంచాన్ని చూడొచ్చు. మొదట్లో కంటి చూపు సామర్థ్యం తక్కువగానే ఉన్నా.. ఆ తర్వాత బాగా మెరుగుపడుతుంది.

అయితే ఈ ప్రయోగానికి సంబంధించిన పనులు ప్రారంభ దశలోనే ఉన్నాయి. ఎప్పటిలోగా ఈ ప్రయోగం పూర్తవుతుందో న్యూరాలింక్ వెల్లడించలేదు.

న్యూరాలింక్ చేపడుతున్న అరుదైన ప్రయోగం నెరవేరితే అంధుల పాలిట ఇది వరం కానుంది. వారు కూడా అందంగా లోకాన్ని చూడగలరు.