మరో గ్రహాంపై కన్నేసిన ఇస్రో.. కేంద్రం గ్రీన్‌సిగ్నల్.. 

22 September 2024

TV9 Telugu 

చంద్రుడు, అంగారక గ్రహాల తర్వాత, భారతదేశం ఇప్పుడు మరో గ్రహానికి వెళ్లడానికి సిద్ధమవుతోంది. ఇప్పుడు భారత శాస్త్రవేత్తలు వీనస్ లక్ష్యంపై కన్నేశారు.

అంతరిక్షంలో మరోసారి త్రివర్ణ పతాకం మళ్లీ అలరించనుంది. వీనస్ ఆర్బిటర్ మిషన్ శ్రీకారం చుట్టబోతున్న భారత్.

రూ.1200 కోట్ల వ్యయంతో రూపొందుతున్న వీనస్ ఆర్బిటర్ మిషన్‌కు భారతదేశ కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఈ మిషన్‌లో మ్యాన్‌యాన్‌ మాదిరిగానే వీనస్‌పైకి ఆర్బిటర్‌ను పంపనున్నారు. ఈ మిషన్ VOM లో, వీనస్ ఉపరితలం, వాతావరణం అధ్యయనం చేయనున్నారు.

బుధవారం అంతరిక్షానికి సంబంధించిన అనేక ముఖ్యమైన ప్రతిపాదనలను ఆమోదించింది కేంద్రం. ఇందులో వీనస్ ఆర్బిటర్ మిషన్ (VOM) కూడా ఉంది.

వీనస్ ఆర్బిటర్ మిషన్ ఉద్దేశ్యం శాస్త్రీయ పరిశోధనలు చేయడం, భూగర్భ శాస్త్రాన్ని అర్థం చేసుకోవడం. దాని దట్టమైన వాతావరణాన్ని పరిశోధించి శాస్త్రీయ డేటాను సేకరిస్తారు.

వీనస్‌కు భారతదేశం మొదటి మిషన్ VOM కోసం రూ. 1,236 కోట్లు ఖర్చు అవుతుంది. అందులో రూ. 824.00 కోట్లు వ్యోమనౌక కోసం మాత్రమే ఖర్చు అవుతుంది.

శుక్రుడు భూమికి దగ్గరగా ఉన్న గ్రహం. భూమి పరిస్థితుల కారణంగా ఈ గ్రహం ఏర్పడిందంటారు. గగన్‌యాన్ పరిధిని విస్తరింపజేస్తూ ఇస్రో మొదటి యూనిట్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం.