సామ్‌సంగ్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. 

Narender Vaitla

23 September 2024

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ ఇటీవల గ్యాలక్సీ ఎమ్‌35 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా  ఈ ఫోన్‌పై అమెజాన్‌ భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది.

ఈ ఫోన్‌పై ఏకంగా రూ. 6250 డిస్కౌంట్‌ లభిస్తుండడం విశేషం. ఈ ఫోన్‌ అసలు ధర రూ. 24,999కాగా సేల్‌లో భాగంగా 18 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది.

దీంతో పాటు పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగార రూ. 2 వేల వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు. ఇక మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌ చేసుకోవడం ద్వారా గరిష్టంగా రూ. 18,750 వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు.

ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో6.6 ఇంచెస్‌తో కూడిన సూపర్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఇది 1080 x 2340 Pixels and 120Hz రిఫ్రెష్‌ రేట్ ఈ స్క్రీన్‌ సొంతం.

ఇక గ్యాలక్సీ ఎమ్‌35 స్మార్ట్‌ ఫోన్‌లో 6000 ఎమ్‌ఏహెచ్‌తో కూడిన పవర్‌ ఫుల్ బ్యాటరీని అందించారు. అలాగే కూలింగ్ ఛాంబర్‌ను ఇచ్చారు. దీంతో ఫోన్‌ త్వరగా వేడెక్కకుండా ఉంటుంది.

కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఈ ఫోన్‌లో 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. 

ఈ ఫోన్‌ను గొరిలా విక్టస్‌+ ప్రొటెక్షన్‌తో తీసుకొచ్చారు. దీంతో ఈ ఫోన్‌ స్క్రీన్‌కు మంచి భద్రత ఉంటుంది. స్నాప్‌ డ్రాగన్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది.