సైబర్ దాడులు.. ఇటీవల కాలంలో జనాలను భయాందోళనకు గురిచేస్తున్న అంశం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఏదో ఒక రకంగా సైబరాసురులు వ్యక్తిగత డేటాను తస్కరించడంతో పాటు ఆన్ లైన్ చోరీలకు పాల్పడుతున్నారు. ఏ మాత్రం అవకాశం దొరికినా ప్రజలను నిండాముంచుతున్నారు. అసలు వీరు ఎలా వ్యక్తుల డేటాను సేకరిస్తారు? ఎలా మోసం చేస్తారు? అనే విషయంపై క్లారిటీ ఉంటే ఈ దాడులను నిరోధించే అవకాశం ఉంది. ప్రధాన వీరు మీకు ఏదైనా తెలియని నంబర్ల నుంచి ఆకర్షణీయమైన ఆఫర్ల పేర్లతో లింకులను పంపుతారు. వాటిని ఓపెన్ చేయగానే సదరు వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని, వాళ్ల బ్యాంకుల్లో సొమ్ములను కాజేస్తున్నారు. అలాగే మనం వినియోగించే యాప్ ల ద్వారా మన సమాచారాన్ని తస్కరిస్తారు. మనం ఏవో అవసరం అయ్యి గూగుల్ ప్లే స్టోర్ లో దొరికన యాప్ లను డౌన్ లోడ్ చేసుకుంటాం.. అయితే వాటిల్లో హానికరమైన యాప్స్ కూడా ఉంటాయి. వాటిని గుర్తించకపోతే ఆ యాప్ లకు ఇచ్చే పర్మిషన్ల ద్వారా సైబరాసురులు మీ వ్యక్తిగత డేటాను తస్కరిస్తారు. అలాంటి 19 రకాల ప్రమాదకరమైన యాప్స్‌ను నిపుణులు గుర్తించారు. ఇవి మీ ఫోన్ లో ఉంటే వెంటనే మాల్వేర్ ఫా వెంటనే తమ ఫోన్ల నుంచి డిలీట్ చేయాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో చూద్దాం..
సైబర్ నేరగాళ్లు స్మార్ట్‌ఫోన్ డేటాను యాక్సెస్ చేసుకోనేందుకు అనేక కొత్త మార్గాలను అన్వేషిస్తున్నట్లు మాల్వేర్ ఫాక్స్ తన నివేదికలో స్పష్టం చేసింది. గూగుల్ ప్లేస్టోర్‌లోని కొన్ని ప్రమాదకర యాప్‌లను వినియోగించి స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు వెల్లడించింది. ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రోగ్రాం కావడంతో.. మాల్వేర్ ప్రోగ్రాం అయిన ట్రోజన్, యాడ్వేర్, స్పైవేర్, కీలాగ్గర్ లాంటివి వినియోగించి వారి యాజర్ల డేటాను యాక్సెస్ చేసేస్తున్నట్లు వివరించింది.
సైబర్ నేరగాళ్లు గూగుల్ ప్లే స్టోర్‌లోని కొన్ని ఓరిజినల్ యాప్‌లకు కొన్ని హానికరమైన కోడింగ్ చేసి, కొత్త వెర్షన్, కొత్త పేర్లతో ప్రవేశపెడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే పలువురి ఫోన్లలో ఈ యాప్ లు ఉండే అవకాశం కూడా ఉంది. వాటిని డిలీట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ యాప్ లు ఏవంటే..
హార్లీ ట్రోజన్ కలిగి ఉన్న యాప్‌లు.. ఫ్రీ గేమ్‌హబ్ అండ్ బాక్స్, హోప్ కెమెరా- పిక్సర్ రికార్డ్, సేమ్ లాంచర్ అండ్ లైవ్ వాల్‌పేపర్, అమెజింగ్ వాల్‌పేపర్, కూల్ ఎమోజీ అండ్ స్టిక్కర్.
జోకర్ స్పైవేర్ కలిగి ఉన్న యాప్‌లు.. సింపిల్ నోట్ స్కానర్, యూనివర్సల్ పీడీఎఫ్ స్కానర్, ప్రైవేట్ మెసెంజర్, ప్రీమియం ఎస్ఎంఎస్, బ్లడ్ ప్రెజర్ చెక్కర్, కూల్ కీబోర్డ్, పెయింట్ ఆర్ట్, కూలర్ మెసేజ్.
ఆటోలికోస్ మాల్వేర్ కలిగి ఉన్న యాప్‌లు.. వ్లాగ్ స్టార్ వీడియో ఎడిటర్, క్రియేటివ్ 3డీ లాంచర్, వావ్ బ్యూటీ కెమెరా, గిఫ్ ఎమోజీ కీబోర్డ్, ఇన్స్టంట్ హార్ట్‌రేట్ ఎనీటైం, డెలికేట్ మెసేంజర్.
ఈ 19 యాప్ లు మీ ఫోన్ లో ఉంటే తక్షణమే వాటిని డిలీట్ చేయాలి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..