AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smartphones: జూన్‌లో స్మార్ట్‌ఫోన్ల జాతర.. ది బెస్ట్ ఫోన్స్ లాంచ్..!

కొత్తగా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా, ఏ కంపెనీ ఫోన్ తీసుకోవాలనే దానిపై తర్జన భర్జన పడుతున్నారా, మార్కెట్ లోని అన్ని మోడళ్లను పరిశీలించినా మీకు నచ్చిన ఫోన్ దొరకలేదా? అయితే ఏ మాత్రం విసుగు చెందకండి. మీ లాంటి వారి కోసం జూన్ నెలలో వివిధ బ్రాండ్లకు చెందిన ఫోన్లు విడుదల కానున్నాయి.

Smartphones: జూన్‌లో స్మార్ట్‌ఫోన్ల జాతర.. ది బెస్ట్ ఫోన్స్ లాంచ్..!
Smart Phones
Nikhil
|

Updated on: May 27, 2025 | 6:00 PM

Share

ఆధునిక ఫీచర్లు, అధిక బ్యాటరీ సామర్థ్యం, చక్కని ప్రాసెసర్, స్పష్టమైన డిస్ ప్లే తదితర ప్రత్యేకతలతో ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ లో మార్కెట్ లోకి విడుదల కానున్న కొత్త ఫోన్లు, వాటి ఫీచర్లు, ధర వివరాలను తెలుసుకుందాం.

వన్ ప్లస్ 13ఎస్

కొత్తగా మార్కెట్ లోకి విడుదల కానున్న స్మార్ట్ ఫోన్లలో వన్ ప్లస్ 13 ఎస్ ఒకటి. ఈ ఫోన్ జూన్ 5న విడుదల అవుతుందని సమాచారం. 6.32 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ ప్లే, స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్ సెట్, డ్యూయల్ 50 ఎంపీ కెమెరా సిస్టమ్, 80 డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ కు మద్దతు ఇచ్చే 6,260 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా చార్జింగ్ అయిపోతుందనే ఇబ్బంది లేకుండా రోజంతా చక్కగా వినియోగించుకోవచ్చు. ఈ ఫోన్ రూ.49,990 ధరలో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

నథింగ్ ఫోన్ 3

జూన్ విడుదల కానున్న బెస్ట్ ఫోన్లలో నథింగ్ ఫోన్ 3 ముందు వరసలో ఉంటుంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ ఫోన్ లో 6.67 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే ఏర్పాటు చేశారు. స్నాప్ డ్రాగన్ 8 ఎస్ జెన్ 3 ప్రాసెసర్ తో పనితీరుకు ఇబ్బంది ఉండదు. కెమెరా సెటప్ కు సంబంధించి ట్రిపుల్ లెన్స్ కాన్ఫిగిరేషన్ తో పాటు 64 ఎంపీ ప్రైమరీ లెన్స్ ఉండవచ్చు. 100 డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ మద్దతు ఇచ్చే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఈ ఫోన్ ధర రూ.44,999 ఉండే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

వీవో టీ4 అల్ట్రా

జూన్ నెల మధ్యలో వీవో టీ4 అల్ట్రా స్మార్ట్ ఫోన్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీనిలో 6.67 అంగుళాల పీఓఎల్ఈడీ డిస్ ప్లే, 50 ఎంపీ సోనీ సెన్సార్ తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్, 50 ఎంపీ పెరిస్కోప్ లెన్స్, 10 ఎక్స్ మాక్రో ఉంటాయని భావిస్తున్నారు. బ్యాటరీ, ఇతర విషయాలపై పూర్తిస్థాయి సమాచారం లేదు.

ఇన్ఫినిక్స్ జీటీ 30

ఇటీవల మొబైల్ ఫోన్ లో గేమ్స్ ఆడేవారు విపరీతంగా పెరిగారు. ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా గేమ్స్ ఆడుతూ కనిపిస్తున్నారు. అలాంటి గేమింగ్ ప్రియుల కోసం ఇన్ఫినిక్స్ జీటీ 30 స్మార్ట్ ఫోన్ రూపొందించారు. ఈ ఫోన్ జూన్ మొదటి వారంలో విడుదల కానుంది. మీడియా టెక్ డైమెన్సిటీ చిప్ సెట్, అధిక రిఫ్రెష్ రేట్ కలిగిన డిస్ ప్లే, పెద్ద బ్యాటరీతో అందుబాటులో వస్తుందని భావిస్తున్నారు. దీని ధర దాదాపు రూ.25 వేలు ఉండే అవకాశం ఉంది. వీటిలో పాటు ఒప్పో తదితర బ్రాండ్ల నుంచి ఫోన్లు విడుదల కానున్నాయి.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

8 సిక్సర్లు, 5 ఫోర్లు.. 51 బంతుల్లో కుమ్మేసిన కేకేఆర్ సంచలనం
8 సిక్సర్లు, 5 ఫోర్లు.. 51 బంతుల్లో కుమ్మేసిన కేకేఆర్ సంచలనం
1 రూపాయికే విమాన టికెట్‌.. ఇండిగో బంపర్‌ ఆఫర్‌..
1 రూపాయికే విమాన టికెట్‌.. ఇండిగో బంపర్‌ ఆఫర్‌..
మీ మొక్కలు వాడిపోతున్నాయా? అయితే ఈ 'చెత్త' ట్రిక్ ఫాలో అవ్వండి..
మీ మొక్కలు వాడిపోతున్నాయా? అయితే ఈ 'చెత్త' ట్రిక్ ఫాలో అవ్వండి..
ఉట్టిపడుతున్న సంక్రాతి శోభ.. ఛలో శిల్పారామం..
ఉట్టిపడుతున్న సంక్రాతి శోభ.. ఛలో శిల్పారామం..
సికింద్రాబాద్ టు తిరుపతి వందే భారత్‌లో కీలక మార్పులు!
సికింద్రాబాద్ టు తిరుపతి వందే భారత్‌లో కీలక మార్పులు!
అడ్డంకులు వస్తే భయపడుతున్నారా? గెలిచే వాడి 'సీక్రెట్' ఇదే
అడ్డంకులు వస్తే భయపడుతున్నారా? గెలిచే వాడి 'సీక్రెట్' ఇదే
తెల్ల నువ్వులు వర్సెస్‌ నల్ల నువ్వులు.. చలికాలంలో ఏది బెటర్..?
తెల్ల నువ్వులు వర్సెస్‌ నల్ల నువ్వులు.. చలికాలంలో ఏది బెటర్..?
నెమలి ఈకలను ఇంట్లోని ఈ 5 ప్రదేశాల్లో పెట్టండి.. మీపై సంపద వర్షమే
నెమలి ఈకలను ఇంట్లోని ఈ 5 ప్రదేశాల్లో పెట్టండి.. మీపై సంపద వర్షమే
పండగ వేళ BSNL దిమ్మదిరిగే ఆఫర్‌.. 5000GB డేటా, OTT ప్రయోజనాలు
పండగ వేళ BSNL దిమ్మదిరిగే ఆఫర్‌.. 5000GB డేటా, OTT ప్రయోజనాలు
హ్యాండిచ్చిన ఆటగాళ్లు.. కట్‌చేస్తే ఆ లీగ్‌నే వాయిదా వేసిన బంగ్లా
హ్యాండిచ్చిన ఆటగాళ్లు.. కట్‌చేస్తే ఆ లీగ్‌నే వాయిదా వేసిన బంగ్లా