
గృహ వినోదానికి కేరాఫ్ అడ్రస్ టీవీ. అది లేని ఇల్లు ఉండదు. ఇటీవల కాలంలో స్మార్ట్ టీవీలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మారిపోతున్న వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా స్మార్ట్ టీవీలు అప్ డేట్ అయ్యాయి. వాటిల్లో ఓటీటీ ప్లాట్ ఫారంలు, మంచి వీడియో, ఆడియో విజువల్స్ అందరూ కోరుకుంటున్నారు. అదే సమయంలో బడ్జెట్ విషయంలో కాస్త ఆలోచిస్తున్నారు. మరీ ఎక్కువ బడ్జెట్ కాకుండా ఉండేలా చూసుకుంటున్నారు. నిన్నమొన్నటి వరకూ అధిక ధరలు పలికిన స్మార్ట్ టీవీలు గత కొంత కాలంగా తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా ఏదైనా చిన్న బెడ్ రూంకి అనువైన టీవీ కావాలనుకుంటే 32 అంగుళాల టీవీలు సరిపోతాయి. ఈ 32 అంగుళాల టీవీలు రూ. 7000 నుంచి మొదలవుతున్నాయి. వీటిల్లో టాప్ బ్రాండ్లు అయిన ఎల్జీ, శామ్సంగ్, సోనీ, రెడ్ మీ, టూషిబా వంటి బ్రాండ్లు ఉన్నాయి. పైగా వీటిపై ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ లో అదిరే డిస్కౌంట్లు ఉన్నాయి. ఆ డీల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఈ టీవీ 60హెర్జ్ రిఫ్రెష్ రేట్ కలిగిన హెచ్ డీ రెడీ డిస్ ప్లే ఉంటుంది. గూగుల్ టీవీ, డ్యూయల్ బ్యాంక్ వైఫై, హెచ్డీఎంఐ, యూఎస్బీ పోర్టుల సాయంతో కనెక్టివిటీ ఉంటుంది. డాల్బీ ఆడియో సిస్టమ్ ఉంటుంది. దీని ఎంఆర్పీ రూ. 24,999కాగా.. అమెజాన్లో దీనిపై 48శాతం డిస్కౌంట్ ఉంది. అంటే కేవలం రూ. 12,999కే దీనిని కొనుగోలు చేయొచ్చు. అమెజాన్ కస్టమర్ రివ్యూ రేటింగ్ లో దీనికి 4.2 రేటింగ్ ఉంది.
ఈ హెచ్డీ రెడీ ఎల్ఈడీ ఫైర్ టీవీలో 60హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో డిస్ ప్లే ఉంటుంది. డ్యూయల్ బ్యాంక్ వైఫై, హెచ్డీఎంఐ, యూఎస్బీ పోర్టుల ద్వారా కనెక్టివిటీ ఉంటుంది. ఫైర్ ఓఎస్ 7, డాల్బీ ఆడియో, డీటీఎస్ వర్చువల్ ఎక్స్ సిస్టమ్ అందుబాటులో ఉంటుంది. దీనిలో ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్ వంటి ఓటీటీ ప్లాట్ ఫారంలు ఇన్ బిల్ట్ ఉంటాయి. దీని ఎమ్మార్పీ రూ. 24,999కాగా, అమెజాన్ లో ఏకంగా 52శాతం డిస్కౌంట్ లభిస్తోంది. అంటే కేవలం రూ. 11,999కే దీనిని దక్కించుకోవచ్చు.
ఈ హెచ్ డీ రెడీ ఎల్ఈడీ టీవీలో 60హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో డిస్ ప్లే ఉంటుంది. స్క్రీన్ షేర్, కంటెంట్ గైడ్, బహుళ కనెక్టివిటీ ఆప్షన్లు ఉంటాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్‌ల యాప్ లకు మద్దతు ఇస్తుంది. దీని ఎమ్మార్పీ రూ. 18,900కాగా అమెజాన్లో 21శాతం తగ్గింపు ఉంది. అంటే కేవలం రూ. 14,990కే దీనిని కొనుగోలు చేయొచ్చు. రెండు హెచ్డీఎంఐ పోర్టులు, ఒక యూఎస్బీ పోర్ట్ సాయంతో కనెక్ట్ చేసుకోవచ్చు. పర్సనల్ కంప్యూటర్, మ్యూజిక్ సిస్టమ్ ఫీచర్లు ఉంటాయి. స్పష్టమైన విజువల్స్ కోసం మెగా కాంట్రాస్ట్, పుర్ కలర్ ఉంటుంది.
ఇది బెజెల్ లెస్ డిజైన్ తో వస్తుంది. హెచ్ డీ రెడీ ఎల్ఈడీ స్క్రీన్ 60హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఆండ్రాయిడ్ టీవీ, గూగుల్ అసిస్టెంట్, టీ కాస్ట్, హెచ్డీఆర్ 10 సపోర్టుతో వస్తుంది. దీని ఎమ్మార్పీ రూ. 19,990కాగా ఏకంగా 60శాతం డిస్కౌంట్ తో రూ. 7,990కే దీనిని దక్కించుకోవచ్చు. డాల్బీ ఆడియోతో ఏ+ గ్రేడ్ ప్యానెల్ ఇందులో ఉంటుంది.
ఇది ఫ్రేమ్ లెస్ సిరీస్ హెచ్ డీ రెడీ టీవీ. దీని డిజైన్ చాలా స్టైలిష్ గా ఉంటుంది. హెచ్ డీ రెడీ స్క్రీన్ 60హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. ఇంటెలిజెంట్ ప్రాసెసింగ్ ఇంజిన్ టెక్నాలజీ , బహుళ కనెక్టివిటీ ఎంపికలు ఉంటాయి. దీని ఎమ్మార్పీ రూ. 12,999కాగా అమెజాన్లో 48శాతం డిస్కౌంట్ తో రూ. 6,799కే దీనిని కొనుగోలు చేయొచ్చు. దీనికి ఒక సంవత్సరం వారంటీ కూడా ఉంటుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..