యాపిల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ యాపిల్ ఎయిర్ పాడ్స్ ఉంటాయి. వాటిని వినియోగించడం అలవాటు చేసుకున్నారు.
ఎందుకంటే ఎయిర్ పాడ్స్ సాయంతో వినియోగదారులు ఐఫోన్ వాడటం సులభతరం అవుతుంది. వీటిని ఉపయోగించి ఫోన్ కాల్స్ మాట్లాడటంతో పాటు వీడియో కాల్స్ మాట్లాడే సమయంలో చాలా ఉపయుక్తంగా ఉంటాయి. అయితే ఇటీవల కాలంలో ఈ ఎయిర్ పాడ్స్ కు కనెన్టివిటీ సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా ఫోన్ కాల్స్, వాట్సాప్ కాలింగ్, ఐ మెసేజ్, ఇతర ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌ల ద్వారా ఆడియో లేదా వీడియో కాల్‌లు చేస్తున్నప్పుడు సమస్యలను ఎదుర్కొంటున్నారు. మరి ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి? వినియోగదారులే చేసేసుకోవచ్చా? లేక యాపిల్ సర్వీస్ సెంటర్ కు వెళ్లాల్సిందేనా? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఎయిర్ పాడ్స్ వినియోగదారులకు ఎదురయ్యే ప్రధాన సమస్య ఎయిర్ పాడ్ మీ ఫోన్ కి కనెక్ట్ కాకపోవడం. దీనికి ప్రధాన కారణం ఐఫోన్ మైక్రోఫోన్ యాక్సెస్ ను నిరాకరించడం. మొదటిగా మీరు ఎయిర్ పాడ్ కనెక్ట్ చేయాలంటే ఐఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి ఆ మైక్రోఫోన్ యాక్సెస్ ను ఇవ్వాలి. అప్పటికీ ఎయిర్ పాడ్స్ పనిచేయకపోతే.. ఒకసారి దానిని శుభ్రం చేసి ప్రయత్నించాలి. అయినా కూడా అవి పనిచేయకపోతే యాపిల్ సర్వీస్ సెంటర్ కి తీసుకెళ్తారు. అయితే అలా కాకుండా మరో పరిష్కారం కూడా ఉంది. అదేంటేంటే మరోసారి సెట్టింగ్స్ లోకి వెళ్తే దానిలో కుడి, ఎడమ ఎయిర్ పాడ్స్ లలో ఏదో ఒకటి మాత్రమే ఉపయోగించుకునే వీలు ఉంటుంది. మైక్రోఫోన్ ఇన్ పుట్ గా ఏదో ఒకటి మాత్రమే వాడే విధానాన్ని డీఫాల్ట్ ఆటోమేటిక్ మోడ్లో ఉంటుంది. కాల్స్ వచ్చినప్పుడు ఆటోమీటిక్ గా ఏ వైపు ఇయర్ బడ్ ఉపయోగించాలో అదే నిర్ణయిస్తుంది. ఒకవేళ మీరు మాన్యువల్ గా కూడా చేసుకోవాలనుకుంటే సెట్టింగ్స్ లో ఆ సౌలభ్యం కూడా ఉంటుంది. అదెలా మార్చుకోవాలో చూద్దాం..
ఐఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి సెట్టింగ్స్ ను ఓపెన్ చేయాలి. దాని ఎగువన ఎయిర్ పాడ్స్ ఆప్షన్ పై ప్రెస్ చేయాలి. మీకు ఓపెన్ అయిన సెట్టింగ్స్ పేజీలో కిందికి స్క్రోల్ చేస్తే మైక్రోఫోన్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి, ఏదో ఒకవైపు ఇయర్ బడ్ ను ఎంపిక చేసుకోండి. తర్వాత ఎవరికైనా కాల్ చేసి చెక్ చేసుకోండి. కాల్ వినపబడకపోతే మళ్లీ మరోవైపు ఇయర్ బడ్ కి సెట్టింగ్ మార్చి మళ్లీ కాల్ చేసి చెక్ చేసుకోవాలి. అప్పుడు ఇయర్ బడ్ లో వాయిస్, ఆడియో క్లారిటీ సరిగ్గా ఉంటుంది.
ఎయిర్‌పాడ్స్ కాల్ కోసం నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌ను కలిగి ఉంటాయి. దీనిని స్విచ్ ఆన్ చేయడం వల్ల కాల్ క్వాలిటీ పెరుగుతుంది, ఎటువంటి బయటి సౌండ్లు వినిపించవు. దీంతో మైక్రోఫోన్ సెట్టింగ్స్ లో వాయిస్ ఐసోలేషన్, వైడ్ స్పెక్ట్రమ్ స్టాండర్డ్ ఫీచర్లు ఉన్నా అవి పని చేయవు. అయితే స్టాండర్డ్ మోడ్ ఇప్పటికీ పని చేస్తుంది, అయితే వాయిస్ ఐసోలేషన్, వైడ్ స్పెక్ట్రమ్ ఫీచర్ పనిచేయడం లేదు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..