Cell Phone Charging: మీ సెల్‌ఫోన్‌కి లోకల్ ఛార్జర్‌ వాడుతున్నారా..! అయితే జాగ్రత్త పేలిపోతుంది..

|

Sep 08, 2021 | 9:57 AM

Cell Phone Charging: ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరి చేతిలో సెల్‌ఫోన్ ఉంటుంది. మొబైల్‌ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఒక పూట తిండి లేకుండా ఉండగలుగుతారు

Cell Phone Charging: మీ సెల్‌ఫోన్‌కి లోకల్ ఛార్జర్‌ వాడుతున్నారా..! అయితే జాగ్రత్త పేలిపోతుంది..
Cell Phone Charging
Follow us on

Cell Phone Charging: ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరి చేతిలో సెల్‌ఫోన్ ఉంటుంది. మొబైల్‌ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఒక పూట తిండి లేకుండా ఉండగలుగుతారు కానీ.. స్మార్‌ఫోన్‌ లేనిదే ఉండలేకపోతున్నారు. అయితే ఫోన్‌ల వాడకం వల్ల కూడా కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లు పేలుతున్న ఘటనలు అనేక ఉన్నాయి. అయితే చాలాసార్లు ఫోన్లు ఛార్జింగ్‌ పెట్టినప్పడే పేలిపోతున్నాయని తేలింది. అసలు ఛార్జింగ్‌ ఎలా పెట్టాలి. ఏ ఛార్జర్‌ వాడాలో తెలుసుకుందాం.

మొబైల్‌ని ఛార్జ్ చేస్తున్నప్పుడు దాని చుట్టూ రేడియేషన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ ఫోన్‌ని లోకల్‌ ఛార్జర్‌తో ఎప్పుడూ ఛార్జింగ్‌ పెట్టవద్దు. ఇదిలా ఉంటే డూప్లికేట్ బ్యాటరీని అస్సలు ఉపయోగించవద్దు. ఎల్లప్పుడు మీరు వాడుతున్న స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఛార్జర్ ఉపయోగించాలి. ఆ కంపెనీ బ్యాటరీయే వాడాలి. అంతేకాకుండా ఛార్జర్ పిన్‌లను తడి చేయవద్దు. ఎప్పుడైనా తడిస్తే దానిని ఆరనివ్వాలి. అలాగే ఉపయోగిస్తే సెల్‌ఫోన్‌ పేలిపోయే ప్రమాదం ఉంటుంది.అలాగే ఫోన్ బ్యాటరీ క్షీణించినట్లయితే వెంటనే దాన్ని భర్తీ చేయాలి. కొత్త బ్యాటరి వాడాలి. ఫోన్‌ను ఎప్పుడూ 100%ఛార్జ్ చేయవద్దు. మీ ఫోన్‌ను 80 నుంచి 90 శాతం వరకు ఛార్జ్ చేస్తే సరిపోతుంది. లేకపోతే మీ ఫోన్ ఓవర్ ఛార్జ్ అయ్యి పేలుడు సంభవించే అవకాశాలు ఉన్నాయి.

తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు:
► బ్యాటరీలు ఉబ్బినట్లు కనిపిస్తే వెంటనే వాటిని ఫోన్ నుంచి తొలగించాలి.
► కంపెనీకి చెందిన ఒరిజనల్‌ ఛార్జర్లు, బ్యాటరీలు మాత్రమే వినియోగించాలి.
► ఛార్జింగ్‌లో ఉండగా కాల్స్‌ మాట్లాడటం, అలాగే గేమ్స్‌ ఆడటం చేయరాదు.
► ఛార్జింగ్ పూర్తయిన తరువాత ప్లగ్‌ నుంచి తొలగించాలి.
► పడుకునేటప్పుడు పక్కనే ఫోన్ పెట్టుకుని ఛార్జింగ్ పెట్టొద్దు.
► ఛార్జింగ్ సమయంలో ఫోన్‌కి ఉండే తొడుగు (కేస్) తొలగించడం మంచిది.
► ఫోన్ బాగావేడిగా ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే ఛార్జింగ్ ఆపేయాలి

Virata Parvam: రానా సినిమాలపై వీడని సందేహాలు.. విరాటపర్వం కూడా అదే దారిలోనా ?..

Kidney Stones: కిడ్నీలలో రాళ్లు ఉన్నవారు ఈ 4 ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు..! ఎందుకంటే

పరగడుపున కలబంద జ్యూస్‌ తాగితే ఎన్నో ప్రయోజనాలు..! ఈ 5 సమస్యలకు చక్కటి పరిష్కారం..