వేసవి కాలంలో ప్రస్తుతం కూల్ కూల్ ఆఫర్లు వినియోగదారులను పలుకరిస్తున్నాయి. ముఖ్యంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్ ఫామ్స్‌లో ఇప్పటికే సమ్మర సేల్స్ ప్రారంభమయ్యాయి. అలాగే ప్రముఖ సంస్థలు సమ్మర్‌లో ప్రత్యేక సేల్స్ నిర్వహిస్తున్నాయి. భారతదేశంలో ఎంఐ ఉత్పత్తులకు ఓ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. దీంతో కంపెనీ కూడా ఎప్పటికప్పుడు వినియోగదారులను ఆకట్టుకోవడానికి కొత్త మోడల్స్ ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు గృహోపకరణాలు వంటివి రిలీజ్ చేస్తుంది. అలాగే ప్రతిసారి సరికొత్త ఆఫర్లతో సేల్స్‌ను కూడా నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఎంఐ కంపెనీ ఫ్యాన్ డే సేల్స్‌తో మన ముందుకు వచ్చింది. అంతే కాకుండా ఎంఐ ప్రొడెక్ట్స్‌పై గతంలో ఎవ్వరూ ఇవ్వనంత డిస్కౌంట్స్‌ను ఈ సేల్‌ల్లో ప్రకటించింది. ఇప్పటికే ప్రారంభమైన ఎంఐ ఫ్యాన్‌డే సేల్ ఈ నెల 10 వరకూ జరగనుంది. ఈ సేల్‌లో ఏయే ఉత్పత్తులపై డిసౌంట్స్ ఇస్తుందో? ఓ సారి తెలుసుకుందాం.
ఈ సేల్‌లో రెడ్ మీ ప్యాడ్ రూ.5999కే సొంతం చేసుకోవచ్చు. మీ వద్ద ఉన్న పాత ఉత్పత్తిని ఎక్స్చేంజ్ చేస్తే రూ.14,999 వరకూ ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది. అలాగే బ్యాంక్ డిస్కౌంట్లన్నీ కలుపుకుంటే రెడ్‌ప్యాడ్ రూ.5999కే మీ సొంతం అవుతుంది. అయితే ఎక్స్చేంజ్ అనేది మీ ఫోన్ స్థితిపై ఆధారపడి ఉంటుందని గమనించాలి.
ఈ ఫోన్ రూ.22,999కు అందుబాటులో ఉన్నా ఎక్స్చేంజ్ ఆఫర్లు, పేటీఎం క్యాష్ బ్యాక్ అన్నీ వర్తింపజేస్తే ఈ ఫోన్ రూ.11,699కే అందుబాటులో ఉంటుంది.
ఈ టీవీ ఈ సేల్‌లో కేవలం రూ.71,999కే అందుబాటులో ఉంది. ఈ టీవీ సాధారణ ధర రూ.99,999గా ఉంది. అయితే కూపన్ కోడ్ ద్వారా రూ.25,000 తగ్గింపు లభించగా, పేటీఎం క్యాష్ బ్యాక్ ద్వారా మరో రూ.3000 తగ్గి ఈ టీవీ రూ.71,999కే వినియోగదారులకు అందనుంది.
ఫైర్ టీవీ బిల్డ్ ఇన్‌తో కొత్తగా ప్రారంభించిన ఈ టీవీ ఎంఆర్‌పీ ధర రూ.24,999గా ఉండగా ఈ సేల్‌లో ఈ టీవీపై రూ.10,999 తగ్గింపు లభించనుంది.
ఈ సేల్‌లో యువతను ఎంతగానో ఆకర్షించిన ల్యాప్‌టాప్‌లు రూ.49,000కు అందుబాటులో ఉంది. అలాగే ఎంఐ నోట్ బుక్ ప్రో రూ.46000కు అందుబాటులో ఉంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..