ప్రతి ఒక్కరూ తమ ఇంటిని ప్రత్యేకంగా డిజైన్ చేసుకుంటారు. వాటిలో ప్రతి వస్తువూ కొత్తగా ఉండాలని కోరుకుంటారు. ముఖ్యంగా టీవీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. దానిలో తమకు నచ్చిన కార్యక్రమం వీక్షిస్తూ సేదతీరుతారు. టీవీల నుంచి స్పష్టమైన ఆడియోను అందించే సౌండ్ బార్ లకు ప్రస్తుతం ఆదరణ పెరిగింది. ఇవి ఇంటిని మినీ థియేటర్ లా మారుస్తాయి. టీవీలో కార్యక్రమాలను ఉత్సాహంగా వీక్షించే వీలు కల్పిస్తాయి. 5.1 సరౌండ్ సౌండ్, హై గ్రేడ్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు కలిగిన సౌండ్ బార్లు అమెజాన్ లో దాదాపు 71 శాతం డిస్కౌంట్ పై అందుబాటులో ఉన్నాయి. దానితో పాటు క్యాష్‌బ్యాక్, ఉచిత డెలివరీ, నో కాస్ట్ ఈఎంఐ తదితర ఎంపికలు కూడా పొందవచ్చు. జెబ్రోనిక్స్, సోనీ, సామ్సంగ్ తదితర బ్రాండ్లకు చెందిన సౌండ్ బార్ ల గురించి తెలుసుకుందాం.
ఈ డాల్బీ సౌండ్‌బార్‌లో 6.35 సెంటీమీటర్ల రెండు డ్రైవర్లను ఏర్పాటు చేశారు. అలాగే సబ్‌వూఫర్‌లో 13.33 సెంటీమీటర్ల సింగిల్ డ్రైవర్ ఉంటుంది. స్పీకర్ నుంచి వచ్చే ధ్వనిని మరింత శ్రావ్యంగా బయటకు విడుదల చేస్తుంది. బ్లాక్ ఫినిషింగ్ తో స్టైలిష్ గా కనిపించే జెబ్రోనిక్స్ జ్యూక్ బార్ డాల్బీ సౌండ్‌బార్ తో మీ ఇంటికి మరింత రిచ్ లుక్ వస్తుంది. అమెజాన్ లో ఈ సౌండ్ బార్ 61 శాతం తగ్గింపు ధరతో రూ. 6,999కు అందుబాటులో ఉంది.
సినిమాలు, షోస్, వినోద కార్యక్రమాలతో పాటు గేమింగ్ సమయంలోను స్పష్టమైన ఆడియాను అందించడం బోఆట్ అవంటే బార్ ప్రత్యేకత. దీనిలోని బహుళ కనెక్టివిటీ పోర్ట్‌లతో మరింత ప్రయోజనం చేకూరుతుంది. దీనిపై అమెజాన్ లో 71 శాతం డిస్కౌంట్ ప్రకటించారు. మీ అవసరానికి అనుగుణంగా చాలా సులభంగా ఉపయోగించవచ్చు. ఈ ప్రీమియం శైలి సౌండ్‌బార్ మీ ఇంటి అందాన్ని మరింత పెంచుతుంది. బోఆట్ అవంటే బార్ సౌండ్ బార్ రూ.11,499 ధరకు అందుబాటులో ఉంది.
5.1 ఛానెల్ కాన్ఫిగరేషన్, 9 స్పీకర్ల 3డ సౌండ్‌తో అద్భుతమైన ఆడియా అనుభవం అందిస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీ ఎంపికతో వైర్‌లెస్ స్ట్రీమింగ్‌కు అవకాశం ఉంది. వైర్‌లెస్ సబ్ వూఫర్ తో మీకు మరింత ఉత్సాహం కలిగిస్తుంది. స్పీకర్ సిస్టమ్‌తో కూడిన రిమోట్ కంట్రోల్ ద్వారా వీటిని చాలా సులభంగా ఉపయోగించవచ్చు. అలాగే నియంత్రణ చేయవచ్చు. అమెజాన్ లో ఈ సామ్సంగ్ సౌండ్ బార్ రూ. 21,899కు అందుబాటులో ఉంది.
జెబ్రోనిక్స్ నుంచి విడుదలైన ఈ సౌండ్ బార్ స్టైలిష్ లుక్ తో ఆకట్టుకుంటోంది. అమెజాన్ లో 64 శాతం తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. సబ్ వూఫర్, డ్యూయల్ రియర్ శాటిలైట్‌లతో అందుబాటులో ఉంది. సంగీతం వింటున్నా, వినోద కార్యక్రమాలు చూస్తున్నా మీకు ఎంతో స్వష్టమైన ధ్వనిని అందజేస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ తో పాటు బాహ్య పరికరాలను సులభంగా 5.1 సౌండ్‌బార్‌కి జత చేయవచ్చు. జెబ్రోన్ ఐసీఎస్ జూక్ బార్ ధర రూ.9,999.
ఆన్‌లైన్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్లలో ఒకటైన సోనీ హెచ్ టీ ఎస్20ఆర్ రియల్ 5.1 అంగుళాల డాల్బీ డిజిటల్ సౌండ్ బార్ పై అమెజాన్ లో 28 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు. వైర్డు, వైర్‌లెస్ అనే కనెక్టివిటీ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. టీవీ కోసం సౌండ్‌బార్ డాల్బీ ఆడియోతో 5.1 అంగుళాల కాన్ఫిగరేషన్‌ను ఉంది. దీనివల్ల మీకు అత్యంత స్పష్టమైన, రిచ్ బేస్ తో కూడిన సౌండ్ వస్తుంది. ఆటో, స్టాండర్డ్, నైట్, వాయిస్ తదితర మోడ్ లను ఎంచుకోవచ్చు. ఈ సౌండ్ బార్ ధర రూ.17,290.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి