తొలిసారి గాలిలోకి ఎగిరిన ఎలక్ట్రికల్ విమానం

|

May 29, 2020 | 9:01 PM

మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన టెక్నాలజీ కూడా రూపు మార్చుకుంటోంది. తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్‌ విమానం ప్రయోగం విజయవంతమైంది. ఈ సాంకేతిక యుగంలో ఆవిష్కరించిన తొలి భారీ ఎలక్ట్రికల్‌ విమానం వాషింగ్టన్‌ నుంచి ఆకాశంలో తొలిసారి విజయవంతంగా ఎగిరింది. మోసెస్‌ సరస్సు వద్ద దాదాపు 30 నిమిషాల పాటు ఆకాశంలో చక్కర్లు కొట్టింది. సెస్నా -208 క్యారవాన్‌ అనే ఈ విమానాన్ని అమెరికాకు చెందిన మాగ్ని ఎక్స్‌ అనే సంస్థ తయారు చేసింది. ఇది పూర్తి […]

తొలిసారి గాలిలోకి ఎగిరిన ఎలక్ట్రికల్ విమానం
Follow us on

మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన టెక్నాలజీ కూడా రూపు మార్చుకుంటోంది. తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్‌ విమానం ప్రయోగం విజయవంతమైంది. ఈ సాంకేతిక యుగంలో ఆవిష్కరించిన తొలి భారీ ఎలక్ట్రికల్‌ విమానం వాషింగ్టన్‌ నుంచి ఆకాశంలో తొలిసారి విజయవంతంగా ఎగిరింది. మోసెస్‌ సరస్సు వద్ద దాదాపు 30 నిమిషాల పాటు ఆకాశంలో చక్కర్లు కొట్టింది. సెస్నా -208 క్యారవాన్‌ అనే ఈ విమానాన్ని అమెరికాకు చెందిన మాగ్ని ఎక్స్‌ అనే సంస్థ తయారు చేసింది. ఇది పూర్తి ఎలక్ట్రికల్‌ ఇంజిన్‌తో తొమ్మిది మంది ప్రయాణికులు కూర్చొనేలా రూపొందించారు. దీనిలో 750 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన మోటార్‌ను అమర్చారు. ఈ ప్రయోగం సమయంలో మాత్రం ఒక్క పైలట్‌ మాత్రమే గంటకు 183 కి.మీల వేగంతో దీనిలో ప్రయాణం చేశారని తెలిపింది. వాషింగ్టన్‌ నగరం రెడ్మాండ్‌లోని మాగ్ని ఎక్స్‌ అనే స్టార్టప్‌ కంపెనీ సీటెల్‌లోని ఏరోటెక్‌ అనే ఏరో స్పేస్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ సర్టిఫికేషన్ సంస్థతో కలిసి పనిచేస్తోంది. 2021 నాటికి ఈ విమాన కమర్షియల్‌ సర్వీసులను అందుబాటులోకి తేవాలని మాగ్ని ఎక్స్‌ సంస్థ భావిస్తోంది.