Wireless Earbuds: ట్రూ వైర్‌లెస్ ఇయర్ బడ్స్ కొనాలని చూస్తున్నారా? మన దేశంలో టాప్ 5 మోడల్స్ వివరాలివే!

|

Jun 22, 2021 | 5:55 PM

Wireless Earbuds: భారతదేశంలో టిడబ్ల్యుఎస్ లేదా ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు(హెడ్‌ఫోన్స్) మార్కెట్ సంవత్సర కాలంగా పెరుగుతూ వస్తోంది.

Wireless Earbuds: ట్రూ వైర్‌లెస్ ఇయర్ బడ్స్ కొనాలని చూస్తున్నారా? మన దేశంలో టాప్ 5 మోడల్స్ వివరాలివే!
Wireless Ear Buds
Follow us on

Wireless Earbuds: భారతదేశంలో టిడబ్ల్యుఎస్ లేదా ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు(హెడ్‌ఫోన్స్) మార్కెట్ సంవత్సర కాలంగా పెరుగుతూ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ నేతృత్వంలో, టిడబ్ల్యుఎస్ ఇయర్‌బడ్‌లు గాడ్జెట్ వినియోగదారులకు ఒక ముఖ్యమైన అనుబంధంగా మారాయి. కౌంటర్ పాయింట్ పరిశోధనలో 2021 మొదటి మూడు నెలల్లో మన దేశంలో టిడబ్ల్యుఎస్ మార్కెట్ బాగా వృద్ధి చెందింది. అంతేకాదు చాలా కంపెనీలు విడుదల చేసిన ఎన్నో మోడల్స్ ఇప్పుడు దేశీయ మార్కెట్లో విపరీతంగా అమ్ముడుపోతున్నాయి. ఇయర్ బడ్ ల అమ్మకాలు ఈ మధ్యకాలంలో దాదాపు 150 శాతం ఈ సంవత్సరం పెరిగాయి. ఇండియాలో ఇయర్ బడ్స్ మార్కెట్ లో టాప్ మోడల్స్ ఏవి ఉన్నాయి అనేది కౌంటర్ పాయింట్ తెలిపింది. ఆ రిపోర్ట్ ప్రకారం టాప్ ఇయర్ బడ్స్ బ్రాండ్ల వివరాలు పూర్తిగా మీకోసం..

వన్‌ప్లస్ బడ్స్ జెడ్: ధర: రూ. 2,999

సౌకర్యవంతంగా ఉంటాయి. రోజువారీ వినియోగానికి ఇబ్బంది ఉండదు. దీని ప్లాస్టిక్ బాడీ తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. దీనిలో డీప్ బాస్ అంత ఎక్కువగా ఉండకపోవడం ఒక లోపం

బోట్ ఎయిర్‌డోప్స్ 131: ధర: 1,199

తక్కువ ధరలో దొరికే ఇయర్ బడ్స్ ఇవి. బడ్జెట్ తక్కువలో బాగానే ఉంటుంది. కానీ, వాటర్ రెసిస్ స్టంట్ కాకపోవడం ఇబ్బంది. చెమటకు బడ్స్ పాడయ్యే అవకాశం ఉంది. బాస్ వుట్ పుట్ తక్కువ ఉంటుంది.

రియల్మే బడ్స్ Q: ధర: 1,999

ఎక్కువ బ్యాటరీ లైఫ్ (ఛార్జింగ్ కేసుతో మొత్తం 20 గంటలు ప్లేబ్యాక్ సమయం); తేలికపాటి డిజైన్ మరియు సుఖకరమైన ఫిట్, IPX 4 రేటింగ్, నేపథ్య శబ్దం రద్దు లేదు, బాస్-ఆధారిత సంగీతం అంత బాగా వినిపించదు.

బోట్ ఎయిర్‌డోప్స్ 381: ధర: 1,299

డిజైన్, ధర, అనుకూలమైన యాక్సెస్ కంట్రోల్ బటన్లు దీనికి ఉన్నాయి. అదేవిధంగా బ్లూటూత్ వెర్షన్ 5 కి మద్దతు కూడా ఉంది. వాల్యూమ్ నియంత్రణలు లేవు. అలాగే బ్యాటరీ లైఫ్ తక్కువ (ఒకే ఛార్జీలో 4.5 గంటలు మాత్రమె)

బోట్ ఎయిర్‌డోప్స్ 121: ధర: రూ .1,299

తక్కువ ధర; తక్కువ బరువు, రంగు ఎంపికలు, నీరు,చెమట-నిరోధకత అనుకూలాంశాలు. అయితే ప్లాస్టిక్ బాడీ త్వరగా పాడైపోయే అవకాశం అంతే కాకుండా బ్యాటరీ లైఫ్ కూడా కేవలం 3.5 గంటల ప్లే బ్యాక్ సమయాన్ని కలిగిఉండటం ప్రతికూలతలు.

Also Read: Great Place to Work: ఉద్యోగులకు మెరుగైన సౌకర్యాలను కల్పించే దేశంలో టాప్ పది సంస్థలు ఇవే

Old Coins: ఈ కాయిన్ మీ దగ్గర ఉందా..! ఈ నాణానికి బదులుగా రూ. 10 లక్షలు పొందవచ్చు..! ఎలాగో తెలుసుకోండి..!