Apple Watch: యాపిల్ వాచ్ (Apple Wacth) యూజర్లను కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. దేశంలో యాపిల్ వాచ్‌లను ఉపయోగిస్తున్న వారు వెంటనే తమ వాచ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అప్‌డేట్ చేసుకోవాలని తెలిపింది. యాపిల్ వాచ్ ఆపరేటింగ్ సిస్టమ్ 8.7 కన్న తక్కువ వెర్షన్ ఉపయోగిస్తున్న వారు వెంటనే ఓఎస్‌ను అప్‌డేట్ చేసుకోవాలని కేంద్రం తెలిపింది. ఇంతకీ కేంద్రం ఈ హెచ్చరికలు ఎందుకు జారీ చేసిందనేగా మీ సందేహం..
యాపిల్ వాచ్ లో ఉపయోగించే.. 8.7 ఆపరేటింగ్ సిస్టమ్‌లో పలు లోపాలున్నాయని భారత ప్రభుత్వ సైబర్ సైక్యూరిటీ ఏజెన్సీ అయిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా (సీఈఆర్‌టీ-ఇన్) గుర్తించింది. ఈ లోపల వల్ల యాపిల్ సెక్యూరిటీ కోడ్‌లను ఉల్లంఘించి హ్యాకర్లు దాడులు చేస్తున్నారని సీఈఆర్‌టీ-ఇన్ హెచ్చరించింది. దీంతో యూజర్ల వ్యక్తిగత భద్రత ప్రమాదంలో పడే అవకాశాలున్నయాని తెలిపింది.
ముఖ్యంగా ఆడియో, ఐసీయూ, వెబ్ కిట్ వంటి ఫీచర్లలోకి మాల్‌వేర్‌ను పంపించి డేటాను దొంగలించే అవకాశం ఉందని తెలిపింది. ఇదిలా ఉంటే యాపిల్ సంస్థ తమ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఉన్న లోపాల గురించి స్పందించింది. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే వెంటనే ఓస్‌ను అప్‌డేట్ చేసుకోమని సూచించింది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..