Tesla Recalls: వాహనదారుల మెడకు చుట్టుకుంటున్న టెక్నికల్‌ ఎర్రర్‌.. వేలాది వాహనాలు వెనక్కి

|

Feb 10, 2022 | 9:44 AM

Tesla Recalls: టెక్నికల్‌ ఎర్రర్‌ వాహనదారుల మెడకు చుట్టుకుంది. సాంకేతిక సమస్య వేలాది వాహనాల్ని వెనక్కి రప్పించేలా చేసింది. టెక్నికల్‌ ఎర్రర్‌తో వేల వాహనాల్ని రీకాల్‌..

Tesla Recalls: వాహనదారుల మెడకు చుట్టుకుంటున్న టెక్నికల్‌ ఎర్రర్‌.. వేలాది వాహనాలు వెనక్కి
Follow us on

Tesla Recalls: టెక్నికల్‌ ఎర్రర్‌ వాహనదారుల మెడకు చుట్టుకుంది. సాంకేతిక సమస్య వేలాది వాహనాల్ని వెనక్కి రప్పించేలా చేసింది. టెక్నికల్‌ ఎర్రర్‌తో వేల వాహనాల్ని రీకాల్‌ చేసింది టెస్లా. దీంతో టెస్లాకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. టెక్నికల్‌ ఎర్రర్‌ ఎఫెక్ట్‌తో అమెరికాలో 26,681 కార్లను వెనక్కి రప్పించింది టెస్లా. ఈ విషయాన్ని నేషనల్‌ హైవే ట్రాఫిక్‌ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్‌ తాజాగా వెల్లడించింది. ఈ సాఫ్ట్‌వేర్‌ సమస్య వల్ల కారు నడిపే క్రమంలో ఇబ్బందులు ఏర్పడుతాయని పేర్కొంది టెస్లా. హీట్‌ పంప్‌లోని వాల్వ్‌ ఆటోమెటిక్‌గా తెరుచుకుంటుందని స్పష్టం చేసింది. టెక్నికల్‌ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని.. సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేస్తామని తెలిపింది.

ఇక.. ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా చాలా కాలంగా భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అయితే సంస్థ ప్రయత్నాలు పెద్దగా ముందుకు సాగడం లేదు. టెస్లా ‘సీఈ‌ఓ ఎలాన్ మస్క్ సంస్థ కార్లను ఇండియాలో లాంచ్ చేయలేకపోవడానికి గల కారణాన్ని ఇటీవల ట్విట్టర్‌లో పేర్కొనడం భారత్‌లో పెద్ద దుమారాన్ని రేపింది. భారత్‌లో అత్యధిక సుంకమే ఇందుకు కారణంగా చెప్పాడు. టెస్లా ట్వీట్‌కు గట్టిగానే కౌంటరిచ్చింది భారత్‌. దేశంలో ఇప్పటికే దిగుమతి చేసుకున్న ముడి పదార్థాలతో తయారవుతున్న కార్లపై నామమాత్రంగానే పన్ను విధిస్తున్నట్టు స్పష్టం చేసింది.

దేశంలో 40 వేల డాలర్ల కంటే ఎక్కువ ధర ఉన్న దిగుమతి చేసుకున్న ఎలక్ట్రిక్ వాహనాలపై 100 శాతం పన్ను విధిస్తున్నారు. దీని కంటే తక్కువ ధర ఉన్న వాహనాలపై 60 శాతం పన్ను విధిస్తున్నారు. చైనా జనాభాతో పోల్చితే ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులకు అత్యంత ఆశాజనకమైన మార్కెట్ భారత్‌. సుజుకి మోటార్ కార్పొరేషన్, హ్యుందాయ్ మోటార్ కార్లు దేశంలో ఇప్పటికీ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

Nasal Spray: కరోనా బాధితులకు తీపికబురు.. దేశంలోనే తొలిసారిగా నాజల్‌ స్ప్రే

Google Account: గూగుల్‌ అకౌంట్లో మీ వ్యక్తిగత వివరాలు కనిపించకుండా ఉండాలా..? ఇలా చేయండి