Tecno Smartphones: టెక్నో నుంచి కిర్రాక్ స్మార్ట్ ఫోన్లు.. మూడు ఫోన్లు ఒకేసారి లాంచ్.. పూర్తి వివరాలు

|

May 31, 2023 | 7:00 AM

టెక్నో కంపెనీ కొత్త కేమన్ 20 స్మార్ట్ ఫోన్ సిరీస్ ను ప్రారంభించింది. ధర కేవలం రూ. 14,999 నుంచి ఈ ఫోన్లు వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నాయి. వాటిల్లో టెక్నో కేమన్ 20, కేమన్ 20 ప్రో ఫోన్లు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి.

Tecno Smartphones: టెక్నో నుంచి కిర్రాక్ స్మార్ట్ ఫోన్లు.. మూడు ఫోన్లు ఒకేసారి లాంచ్.. పూర్తి వివరాలు
Tecno Camon 20
Follow us on

స్మార్ట్‌ ఫోన్.. మనిషికి ఓ నిత్యావసరంలా తయారైన గ్యాడ్జెట్. ఇది లేకుండా రోజు నిమిషం గడవదు. మార్కెట్లో ఇబ్బండిముబ్బడిగా మోడళ్లు అందుబాటులో ఉంటున్నాయి. అన్ని రకాల బ్రాండ్లు ఎప్పటికప్పుడు తమ ఉత్పత్తులను అప్ గ్రేడ్ చేస్తున్నాయి. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వాటిని లాంచ్ చేస్తున్నాయి. దేశంలో తమ బ్రాండ్ నేమ్ ను చిరస్థాయిగా నిలిచిపోయేలా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదే క్రమంలో టెక్నో కంపెనీ కేమన్ 20 స్మార్ట్ ఫోన్ సిరీస్ ను ప్రారంభించింది. ధర కేవలం రూ. 14,999 నుంచి ఈ ఫోన్లు వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నాయి. వాటిల్లో టెక్నో కేమన్ 20, కేమన్ 20 ప్రో ఫోన్లు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. అలాగే కేమన్ 20 ప్రీమియర్ 5జీ ఫోన్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ కేమన్ స్మార్ట్ ఫోన్ సిరీస్ ఫోన్లలో ఉండే స్పెసిఫికేషన్లు, ధర వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

టెక్నో కేమన్ 20..

ఈ ఫోన్ 8జీబీ ర్యామ్ 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. దీని ధర రూ. 14,999గా ఉంది. 2023 మే 29 నుంచి ప్రముఖ ఈ -కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ లో కొనుగోలుకు అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటోంది. గ్లేసియర్ గ్లో, సెరెనిటీ బ్లూ, ప్రీడాన్ బ్లాక్ ఆప్షన్లలో లభ్యమవుతోంది. దీనిలో 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ ప్లే ఉంటుంది. 60Hz రిఫ్రెష్ మెంట్ రేట్ ఉంటుంది. వెనుకవైపు 64ఎంపీ ప్రధాన కెమెరా ఉంటుంది. ముందు వైపు 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇది మీడియా టెక్ హీలియో జీ85 చిప్ సెట్ తో వస్తుంది. 5000ఎంఏహెచ్ సామర్థ్యంతో కూడిన బ్యాటరీ ఉంటుంది. 33వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంటుంది.

కేమన్ 20 ప్రో 5జీ..

ఈ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఫోన్ రూ. 19,999కాగా.. ఇంటర్నల్ స్టోరేజ్ 256జీబీ ఉన్న ఫోన్ ధర రూ. 21,999గా ఉండనుంది. ఈ ఫోన్ల సేల్స్ జూన్ నుంచి ప్రారంభం కానుంది. దీనిలో 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ మెంట్ రేట్ ఉంటుంది. వెనుకవైపు 50ఎంపీ ప్రధాన కెమెరా ఉంటుంది. ముందు వైపు 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇది మీడియా టెక్ డెమెన్సిటీ 8050 చిప్ సెట్ తో వస్తుంది. 5000ఎంఏహెచ్ సామర్థ్యంతో కూడిన బ్యాటరీ ఉంటుంది. 45వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంటుంది. ఇది సెరెనిటీ బ్లూ, డార్క్ వెల్కిన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

కేమన్ 20 ప్రీమియర్..

దీనిలో కూడా 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ మెంట్ రేట్ ఉంటుంది. వెనుకవైపు 50ఎంపీ ప్రధాన కెమెరా ఉంటుంది. ముందు వైపు 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇది మీడియా టెక్ డెమెన్సిటీ 8050 చిప్ సెట్ తో వస్తుంది. 5000ఎంఏహెచ్ సామర్థ్యంతో కూడిన బ్యాటరీ ఉంటుంది. 45వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంటుంది. ఇది సెరెనిటీ బ్లూ, డార్క్ వెల్కిన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది 8జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యంతో వస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..