
iPhone Battery Life: ఐఫోన్ యూజర్స్ కి బ్యాటరీ లైఫ్ చాలా ప్రాబ్లం. ఆండ్రాయిడ్ ఫోన్లతో పోలిస్తే ఐఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుంది. అంతేకాదు ఎన్నిసార్లు రీఛార్జ్ చేస్తే అంత బ్యాటరీ లైఫ్ కూడా తగ్గిపోతుంది. మీ ఫోన్ సెకండ్ హ్యాండ్ లో అమ్మాలంటే మొదటగా కొనే వ్యక్తి చూసేది మీ ఐఫోన్ కున్న బ్యాటరీ లైఫ్… సో బ్యాటరీ లైఫ్ ని కాపాడుకోవాలన్న… ఇప్పుడున్న పర్సంటేజీ బ్యాటరీ లైఫ్ పెంచుకోవాలన్నా ఈ చిన్న చిన్న టెక్నిక్స్ పాటిస్తే చాలు. నిజానికి మనం వాడే ఫీచర్స్ కన్నా దాదాపుగా మనకు తెలియని 100 ఫీచర్స్ ఐఫోన్ లో ఉంటాయి. ఆపిల్ కంపెనీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అత్యాధునిక ఫీచర్లని ఐఫోన్లలో అందుబాటులో ఉంచింది. నిజానికి చాలామందికి ఇవి ఎలా వాడాలో కూడా తెలియదు. కానీ ఇవే మన బ్యాటరీ లైఫ్ నీ తినేస్తూ ఉంటాయి. అనవసరమైన ఈ ఫీచర్లని ఆపేస్తే రోజంతా ఆపిల్ బ్యాటరీతో ఎంజాయ్ చేయొచ్చు.
సింపుల్‌గా ఈ నాలుగు సెట్టింగ్లను మార్చేయండి:
మొదటిది మీ సెట్టింగ్స్ లో జనరల్ సెట్టింగ్స్ ని క్లిక్ చేయండి. అక్కడ కనిపించే బ్యాక్ గ్రౌండ్ యాప్ రిఫ్రెష్ అనే ఆప్షన్ తీసుకోండి. బ్యాక్ గ్రౌండ్ యాప్ రిఫరెన్స్ ఆఫ్ చేయండి.
దీంతో మీరు ఫోన్ వాడిన వాడుకున్న మీరు ఉపయోగించని అప్లికేషన్స్ కూడా బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవుతూ ఉంటాయి. దీనివల్ల మెజారిటీగా బ్యాటరీ అయిపోతుంది.
రెండవది సెట్టింగ్స్‌లో ఉన్న సిరి క్లిక్ చేయండి. అక్కడ కనిపిస్తున్న అలో నోటిఫికేషన్ తోపాటు కింద ఉన్న నాలుగు ఆప్షన్స్ ని ఆఫ్ చేయండి. దీంతో మీకు అవసరం లేని సిరి సజెషన్స్ ఆగిపోతాయి. దీని ద్వారా బ్యాటరీ చాలా సేవ్ అవుతుంది.
ఇక మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ మోషన్ రెడ్యూస్. సెట్టింగ్స్ లో యాక్సిసబిలిటీ పై నొక్కండి. అక్కడ మీకు మోషన్ అనే మరో ఆప్షన్ కనిపిస్తుంది. అది నొక్కగానే పైన కనిపించే రెడ్యూస్ మోషన్ ని ఆన్ చేయండి. దీని ద్వారా ఆప్ ఐకాన్స్ గ్రాఫిక్స్ మూమెంట్లో కాకుండా నార్మల్ గా కనిపిస్తాయి. దీంతో బ్యాటరీ 15% వరకి సేవ్ అవుతుంది.
ఇక నాలుగోది మీ ఐఫోన్‌ని సింపుల్‌గా డార్క్ మోడ్లో పెట్టండి. లైట్ మూడ్లో పెట్టడం వల్ల బ్యాటరీ ఎక్కువగా ఖర్చవుతుంది. సింపుల్ గా ఈ నాలుగు సెట్టింగ్స్ మార్చి మీ ఐఫోన్ ని రోజంతా పనిచేసే సూపర్ ఫోన్ గా మార్చుకోండి. బ్యాటరీ లైఫ్ పెరగడంతో పాటు మీ ఫోన్ పర్ఫామెన్స్ కూడా చాలా పెరుగుతుంది. ఒక్కసారి సెట్టింగ్స్ మార్చాక మీకే అర్థమవుతుంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి