Tech Tips: మీరు స్మార్ట్‌ఫోన్‌ను 100 శాతం ఛార్జ్ చేస్తున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి!

|

Sep 11, 2023 | 5:30 AM

మొబైల్‌కి ఛార్జింగ్‌ పెట్టేటప్పుడు గమనించాల్సిన విషయం ఏమిటంటే.. 100 శాతం ఛార్జింగ్‌ అయ్యే వరకు వదలకూడదని అనుకుంటారు. మొబైల్‌ను 100 శాతం ఛార్జింగ్ చేయడం వల్ల స్మార్ట్‌ఫోన్ వేడెక్కుతుంది. అలాగే బ్యాటరీపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది బ్యాటరీ పేలిపోయేలా చేస్తుంది. అంతే కాదు బ్యాటరీ లైఫ్ తగ్గిపోయే ప్రమాదం..

Tech Tips: మీరు స్మార్ట్‌ఫోన్‌ను 100 శాతం ఛార్జ్ చేస్తున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి!
Smartphone Charging
Follow us on

ప్రతి ఒక్కరి జీవితంలో స్మార్ట్‌ఫోన్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ప్రయాణం నుండి ప్రతి ఖర్చుకు స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగిస్తాము. ప్రయాణంలో టిక్కెట్‌ కొనుగోలు చేసినా, ఏదైనా వస్తువుకు బిల్లు చెల్లించినా మొబైల్‌ ద్వారానే అన్ని లావాదేవీలు నిర్వహిస్తాం. అందువల్ల, మొబైల్ ఫోన్‌లలో ఛార్జింగ్ అనేది ఒక ముఖ్యమైన అంశం.

ఇప్పుడు చాలా మంది ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు పర్సు లేకుంటే ఇబ్బంది లేదని, మొబైల్ ఫోన్‌లో 100 శాతం ఛార్జింగ్ పెడితే సరిపోతుందని అనుకుంటున్నారు. మీరు కూడా మీ స్మార్ట్‌ఫోన్‌ను 100 శాతం ఛార్జ్ చేస్తున్నట్లయితే ఈ వార్త మీ కోసమే.

మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను 100% కి ఛార్జింగ్ చేస్తే తర్వాత పెద్ద సమస్యలకు దారి తీయవచ్చు. దీని వల్ల మొబైల్ త్వరగా పాడైపోతుంది. అందుకే స్మార్ట్‌ ఫోన్‌కు ఎంత చార్జ్ చేయాలి? అనే విషయంపై అవగాహన ఉంటే మంచిదంటున్నారు టెక్‌ నిపుణులు. స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ కోసం 80- 20 ఫార్ములాను ఉపయోగించడం ఎల్లప్పుడూ ఉత్తమం. ఎందుకంటే ఈ ఫార్ములా మీ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కువ కాలం ఉండేలా చేస్తుంది. అలాగే ఇలా చేయడం వల్ల మీ ఫోన్ డ్యామేజ్ కాకుండా భద్రంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

80-20 ఫార్ములా అంటే ఏమిటి?:

80-20 ఫార్ములా అంటే స్మార్ట్‌ఫోన్‌లో ఛార్జింగ్ 20 శాతం కంటే తగ్గకూడదు. అంటే, 20 శాతం బ్యాటరీ మిగిలి ఉంటే, స్మార్ట్‌ఫోన్‌ను వెంటనే ఛార్జింగ్‌లో పెట్టండి. ఇది బ్యాటరీపై ఒత్తిడిని కలిగించదు. అలాగే బ్యాటరీ జీవితాన్ని పెంచుతుంది.

మొబైల్ ఫోన్‌కి ఎంత చార్జ్ చేయాలి?:

మొబైల్‌కి ఛార్జింగ్‌ పెట్టేటప్పుడు గమనించాల్సిన విషయం ఏమిటంటే.. 100 శాతం ఛార్జింగ్‌ అయ్యే వరకు వదలకూడదని అనుకుంటారు. మొబైల్‌ను 100 శాతం ఛార్జింగ్ చేయడం వల్ల స్మార్ట్‌ఫోన్ వేడెక్కుతుంది. అలాగే బ్యాటరీపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది బ్యాటరీ పేలిపోయేలా చేస్తుంది. అంతే కాదు బ్యాటరీ లైఫ్ తగ్గిపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే స్మార్ట్‌ఫోన్‌ను గరిష్టంగా 80 శాతం వరకు ఛార్జ్ చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు.

అందుకే స్మార్ట్‌ ఫోన్లు ఛార్జింగ్‌ చేసే సమయంలో చాలా విషయాలను తెలుసుకోవడం చాలా మంచిది.
ఇంకో విషయం ఏంటంటే మొబైల్‌ను ఛార్జింగ్‌ పెట్టి కూడా ఫోన్‌ కాల్స్‌ మాట్లాడకూడదని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. ఫోన్‌ కాల్సే కాకుండా ఫోన్‌ ఆపరేటింగ్‌ చేస్తుండటం కూడా ప్రమాదమేనంటున్నారు. ఇలా చేసినట్లయితే ఫోన్‌ పేలిపోయే అవకాశాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. అందుకే ఫోన్‌ వాడటంలో కూడా చాలా విషయాలు తెలుసుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి