టాటా సియార్రా బుకింగ్స్‌ షురూ..! తొలి రోజు ఎన్ని వేల బుకింగ్స్‌ జరిగాయో తెలిస్తే షాక్‌ అవుతారు!

టాటా సియెర్రా SUV భారత మార్కెట్‌లో భారీ స్పందనతో తిరిగి వచ్చింది. మొదటి రోజే 70,000 పైగా బుకింగ్‌లు, 1.35 లక్షల కన్నా ఎక్కువ మంది ఆసక్తిని చూపాయి. రూ.11.49 లక్షల నుండి ప్రారంభమయ్యే ధరతో, LED లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, ADAS వంటి అత్యాధునిక ఫీచర్లతో రీడిజైన్తో వస్తోంది.

టాటా సియార్రా బుకింగ్స్‌ షురూ..! తొలి రోజు ఎన్ని వేల బుకింగ్స్‌ జరిగాయో తెలిస్తే షాక్‌ అవుతారు!
Tata Sierra Suv

Updated on: Dec 17, 2025 | 10:09 PM

భారత మార్కెట్లో SUV ప్రియులలో టాటా సియెర్రా పట్ల ఉన్న క్రేజ్ ఏంటో మరోసారి తెలిసింది. టాటా మోటార్స్ బ్రాండ్ -న్యూ మిడ్-సైజ్ SUV సియెర్రా బుకింగ్ విండో మొదటి రోజున 70,000 కంటే ఎక్కువ బుకింగ్‌లను పొందింది. ఇదొక్కటి చాలా SUV కోసం ఎంత మంది వెయిట్‌ చేస్తున్నారో చెప్పడానికి. అంతేకాకుండా 135,000 కంటే ఎక్కువ మంది కస్టమర్లు తమకు నచ్చిన మోడల్‌ను ఎంచుకోవడం ద్వారా తమ బుకింగ్‌లను పూర్తి చేసే ప్రక్రియలో ఉన్నారు.

ఈ గణాంకాలు టాటా సియెర్రా చుట్టూ ఉన్న హైప్ నిజంగా ప్రతిధ్వనించేలా ఉన్నాయని, ఈ SUV భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో బలమైన కమ్‌బ్యాక్‌ ఇచ్చిందని చూపిస్తున్నాయి. టాటా సియెర్రా ధరను నవంబర్ 25, 2025న ప్రకటించారు. 1991లో దేశంలో మొట్టమొదటి SUV గా ప్రారంభించబడిన టాటా సియెర్రా 2003 వరకు భారత మార్కెట్‌ను ఆధిపత్యం చేసింది. ఈ కారు మూడు దశాబ్దాలకు పైగా ప్రజల అంచనాలు, జ్ఞాపకాలలో భాగంగా ఉంది . ఇప్పుడు టాటా మోటార్స్ కొత్త తరం సియెర్రాను పూర్తిగా రీ డిజైన్‌ చేసింది, దానిని మోడ్రన్‌ ట్రెండ్‌కు, అనుభూతికి అనుగుణంగా మార్చింది. వాటితో అనేక కొత్త ఫీచర్లను జోడించింది.

టాటా సియెర్రా ఆధునిక సాంకేతికతను స్వీకరిస్తూనే దాని పాతకాలపు గుర్తింపు, విలక్షణమైన డిజైన్‌ను నిలుపుకుంది. కొత్త టాటా సియెర్రా ఎక్స్- షోరూమ్ ధర రూ.11.49 లక్షల నుండి ప్రారంభమై రూ.21.29 లక్షల వరకు ఉంటుంది . ఇందులో పూర్తి LED లైటింగ్, సొగసైన, ఆధునిక బాహ్య డిజైన్, ప్రీమియం ఇంటీరియర్, మూడు స్క్రీన్లు, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, 36-డిగ్రీ కెమెరా, లెవల్ 2 AIDAS, 622 లీటర్ల బూట్ స్పేస్ ఇతర ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి