Supermoon: జులై 14న ఆకాశంలో కనువిందు చేయనున్న అద్భుతం..

|

Jul 12, 2022 | 1:21 PM

Supermoon: యావత్ ప్రపంచం ఆసక్తిగా చూసే సూపర్‌మూన్ జూన్ 14వ తేదీన వినీలాకాశంలో కనువిందు చేయనుంది. ఈ ఏడాదిలోనే అతిపెద్ద, అత్యంత ప్రకాశవంతమైన..

Supermoon: జులై 14న ఆకాశంలో కనువిందు చేయనున్న అద్భుతం..
Supermoon
Follow us on

Supermoon: యావత్ ప్రపంచం ఆసక్తిగా చూసే సూపర్‌మూన్ జూన్ 14వ తేదీన వినీలాకాశంలో కనువిందు చేయనుంది. ఈ ఏడాదిలోనే అతిపెద్ద, అత్యంత ప్రకాశవంతమైన సూపర్‌మూన్ 14వ తేదీన ఏర్పడనుందని ఖగోళశాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, ఆకాశంలో అత్యద్భుతంగా దర్శనమించే ఈ సూపర్‌మూన్ పదాన్ని ఖగోళ శాస్త్రవేత్త రిచర్డ్ నోయెల్ 1979లో సూచించారు. పౌర్ణమి లేదా అమావాస్య రోజున ఈ సూపర్‌మూన్ ఏర్పడుతుంది. ఈ సంవత్సరంలో సూపర్‌మూన్ జులై 14న రానుండగా.. జులై 12 వ తేదీ నుంచి జులై 15వ తేదీల్లో తెల్లవారుజామున దాదాపు పూర్తిగా నిండుగా దర్శనమివ్వనున్నాడు చంద్రుడు. ఈ సమయంలో చంద్రున్ని ఫోటో తీయడానికి అనువైనదిగా ఉంటుంది. గురువారం సాయంత్రం చంద్రోదయం, శుక్రవారం ఉదయం చంద్రాస్తమయం జరుగుతుంది. అంటే.. జూలై 14న రాత్రి 08:19 గంటల నుంచి జూలై 15న ఉదయం 06:56 గంటల వరకు చంద్రుడు సుస్పష్టంగా, అతిపెద్దగా, ప్రకాశవంతంగా కనిపించనున్నాడు.

అయితే, భారత్‌లో ప్రస్తుతమున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మేఘాలు చంద్రుడిని కప్పేసేలా ఉన్నాయి. అయినప్పటికీ కొంచెమైనా ఛాన్స్ ఉంటుందని ఖగోళ పరిశోధకులు చెబుతున్నారు. ఈ పౌర్ణమిని ప్రపంచ వ్యాప్తంగా ఒక్కో దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. జులై 14న వచ్చే పౌర్ణమిని భారత్‌లో గురు పూర్ణిమగా పేర్కొంటారు. ఈ రోజున ఉపాధ్యాయులను గౌరవించుకుంటారు. ఇదిలాఉంటే.. ఈ సూపర్‌మూన్‌ను స్థానిక అమెరికన్లు బక్ మూన్ అని పిలుస్తారు. ఈ పౌర్ణమి వేళ ఎక్కువగా పిడుగులు పడే కారణంగా దీనిని థండర్ మూన్ అని కూడా పిలుస్తారు. ఐరోపాలో ఎండుగడ్డి వచ్చే సమయం.. అందుకే దీనిని హే మూన్ లేదా మీడ్ మూన్ అని కూడా పిలుస్తారు. చైనీయులు దీనిని హంగ్రీ ఘోస్ట్ మూన్ అని పిలుస్తారు. ఎందుకంటే.. ఈ సమయంలో ఆత్మలు, మానవుల ప్రపంచం మధ్య అవరోధం స్వల్పంగా ఉంటుందని, ఫలితంగా ఆత్మలు స్వేచ్ఛగా భూమిపై విహరిస్తాయని వారి విశ్వాసం.

పింక్, ఫ్లవర్, స్ట్రాబెర్రీ మూన్స్ అని పిలువబడే సూపర్ మూన్స్.. ఏప్రిల్, మే, జూన్‌లలో సంభవిస్తాయి. ఈ సంవత్సరంలో మొదటి సూపర్‌మూన్ మార్చిలో జరిగింది. వేర్వేరు నివేదికలు వివిధ రకాల పౌర్ణమిలను సూపర్‌మూన్‌లుగా సూచిస్తాయి. అయితే వీటిపట్ల ఏకాభిప్రాయం లేదు. జూలై 15న ఏర్పడే సూపర్‌మూన్ 2022లో చివరి సూపర్‌మూన్.

మరిన్ని సైన్స్&టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..