Boat Smart Watch: మోటాలిక్ డిజైన్‌తో బోట్ నుంచి సూపర్ న్యూ స్మార్ట్ వాచ్.. ధరెంతో తెలుసా?

|

May 18, 2023 | 4:15 PM

బోట్ స్ట్రోమ్ కనెక్ట్ ప్లస్ పేరుతో మెటాలిక్ డిజైన్‌తో ఈ స్మార్ట్ వాచ్ ఆకర్షణీయంగా ఉంది. ఈ వాచ్‌ను రిలీజ్ చేయడంతో బోట్ తన స్మార్ట్‌వాచ్ లైనప్‌ను మరింత విస్తరించింది. ఈ స్మార్ట్ వాచ్ హెచ్‌డీ డిస్ప్లేతో వస్తుంది.

Boat Smart Watch: మోటాలిక్ డిజైన్‌తో బోట్ నుంచి సూపర్ న్యూ స్మార్ట్ వాచ్.. ధరెంతో తెలుసా?
Boat
Follow us on

భారతీయ వినియోగదారులను అలరించడానికి బోట్ కంపెనీ మరో స్మార్ట్ వాచ్ రిలీజ్ చేసింది. బోట్ స్ట్రోమ్ కనెక్ట్ ప్లస్ పేరుతో మెటాలిక్ డిజైన్‌తో ఈ స్మార్ట్ వాచ్ ఆకర్షణీయంగా ఉంది. ఈ వాచ్‌ను రిలీజ్ చేయడంతో బోట్ తన స్మార్ట్‌వాచ్ లైనప్‌ను మరింత విస్తరించింది. ఈ స్మార్ట్ వాచ్ హెచ్‌డీ డిస్ప్లేతో వస్తుంది. అలాగే బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో పాటు వాటర్ రెసిస్టెంట్ ఫీచర్‌తో ఈ వాచ్ వినియోగదారులను ఆకర్షిస్తుంది. బోట్ స్ట్రోమ్ కనెక్ట్ ప్లస్ వాచ్ ధరను కంపెనీ రూ. 1,799గా నిర్ణయించింది. అలాగే యాక్టివ్ బ్లాక్, కూల్ గ్రే, డీప్ బ్లూ, మెరూన్ కలర్ వంటి ఆప్షన్‌లలో ఈ వాచ్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ వాచ్‌ను ఫ్లిప్‌కార్ట్‌తో పాటు బోట్ కంపెనీ వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ స్మార్ట్ వాచ్ ఇటీవల ప్రారంభించిన నాయిస్ కలర్ ఫిట్ వివిడ్ కాల్ స్మార్ట్‌వాచ్‌కు ప్రధాన పోటీగా ఉంటుంది. ఈ స్మార్ట్‌వాచ్‌కు 300 ఎంఏహెచ్ బ్యాటరీ మద్దతు ఉంది. ఈ వాచ్‌ను ఓ సారి చార్జ్ చేస్తే  పది రోజుల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. ఈ వాచ్‌కు వచ్చే ఇతర స్పెసిఫికేషన్లు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

బోట్ స్ట్రోమ్ కనెక్ట్ ప్లస్ మెటాలిక్ ఫ్రేమ్‌తో 2.5 డి కర్వ్డ్ డిజైన్‌తో వస్తుంది. అలాగే 1.91 అంగుళాల హెచ్‌డీ కర్వ్డ్ డిస్‌ప్లేతో ఆకర్షణీయంగా ఉంటుంది. 500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో బ్లూటూత్ 5.3 వెర్షన్‌తో వస్తుంది. అలాగే బ్లూ టూత్ కాలింగ్ ఫీచర్‌తో వస్తుంది. దీంతో వినియోగదారులు స్మార్ట్‌వాచ్ నుండి నేరుగా సమాధానం ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ వాచ్‌లో అంతర్నిర్మిత మైక్, స్పీకర్‌తో కూడా వస్తుంది. కంపెనీ కాల్స్ కోసం ఏఐ నాయిస్ క్యాన్సిలేషన్‌ను అందిస్తుంది. అలాగే వంద కంటే ఎక్కువ క్లౌడ్-ఆధారిత వాచ్ ఫేస్‌లతో వస్తుంది. అలాగే ఐపీ 68 రేటింగ్‌తో దుమ్ము, నీటి-నిరోధకతను కలిగిస్తుంది. బోట్ స్ట్రోమ్ కనెక్ట్ ప్లస్ స్మార్ట్‌వాచ్ వంద కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్స్‌తో వస్తుంది. హృదయ స్పందన రేటుతో పాటు ఎస్‌పీఓ2ను స్థాయిని కూడా ట్రాక్ చేయగలదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..