మంచి ప్రీమియం స్మార్ట్ ఫోన్ కొనాలనుకొంటున్నారా? రేటు కాస్త అటు, ఇటు అయినా ఫీచర్లు మాత్రం తగ్గకూడదని భావిస్తున్నారా? అవసరం అయితే ఈఎంఐ ఆప్షన్ కైనా వెళ్లి టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోనే కొనాలని భావిస్తున్నారా? అయితే మీకో మంచి ఆప్షన్ ఉంది. అదే వన్ ప్లస్ నార్డ్ 3 5జీ స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్ పై అదిరే ఆఫర్ అందిస్తోంది ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్. అమెజాన్ లో గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ ఈ రోజు ప్రారంభమైంది. ప్రైమ్ వినియోగదారులకు ఆగస్టు మూడో తేదీ మధ్యాహ్నమే ఆరంభమైంది. ఈ సేల్లో స్మార్ట్ ఫోన్లపై బెస్ట్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఈ వన్ ప్లస్ నార్డ్ 3 5జీ ఫోన్ కూడా బెస్ట్ ఆఫర్ ఉంది. ఈ మొబైల్ ను అతితక్కువ ఈఎంఐకే సొంతం చేసుకోవచ్చు. ఎంత తక్కువ వంటే కేవలం రోజుకు రూ. 50 మాత్రమే చెల్లించేలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వాస్తవానికి ఈ ఫోన్ ధర మార్కెట్లో రూ. 35,000 ఉండగా.. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్లో బ్యాంక్ ఆఫర్లతో కలిపి రూ. 32,999కే సొంతం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ వన్ ప్లస్ నార్డ్ 3 5జీ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, అమెజాన్లో అందుబాటులో ఉన్న ఆఫర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
ఈ స్మార్ట్ ఫోన్లో 6.74 అంగుళాల సూపర్ ఫ్లూయిడ్ అమోల్డ్ డిస్ ప్లే 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. స్క్రీన్ సంరక్షణ కోసం డ్రాగన్ ట్రయల్ గ్లాస్ ప్రొటెక్షన్ అందుబాటులో ఉంటుంది. డిస్ ప్లే లో ఇన్ బిల్ట్ గా ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్ ఇస్తున్నారు. మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. హెచ్ డీఆర్10 ప్లస్ సపోర్టు ఉంటుంది. కెమెరా విషయానికి వస్తేఈ వన్ ప్లస్ ఫోన్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరాతో పాటు 8 ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్, 2 ఎంపీ మ్యాక్రో లెన్స్ లతో కూడిన సెటప్ ఉంటుంది. ముందువైపు సెల్ఫీల కోసం 16ఎంపీ కెమెరా ఉంటుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 80వాట్ల సూపర్ వూక్ చార్జింగ్ సపోర్టుతో కూడిన 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. అలర్ట్ స్లైడర్, ఐఆర్ బ్లాస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ వన్ ప్లస్ నార్డ్ 3 స్మార్ట్ ఫోన్ ఆక్సిజన్ ఓఎస్ 13.1, ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేస్తుంది. మూడేళ్ల పాటు ఓఎస్ అప్ డేట్లు, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్ డేట్లు వన్ ప్లస్ ఇస్తుంది. ఈ ఫోన్ ధరలు పరిశీలిస్తే 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ సామర్థ్యంతో కూడిన ఫోన్ ధర రూ. 33,999కాగా, 16జీబీ, 256జీబీ స్టోరేజ్ సామర్థ్యం కలిగిన స్మార్ట్ ఫోన్ ధర రూ. 37,999గా ఉంది. ఈ మొబైల్ టెంపెస్ట్ గ్రే, మిస్టీ గ్రీన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
ఈ వన్ ప్లస్ నార్డ్ 3 5జీ ఫోన్ పై అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్లో భాగంగా పలు ఆఫర్లు, డిస్కౌంట్లు ఉన్నాయి. రూ. 1,000 వరకూ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈఎంఐ ఆఫర్ అందుబాటులో ఉంది. ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్ డీఎఫ్సీ బ్యాంక్ లాంటి కార్డులపై ఈఎంఐ ఆఫర్ ను మీరు పొందొచ్చు. ఈఎంఐ నెలకు రూ. 15000 నుంచి ప్రారంభమవుతాయి. అంటే రోజూ కేవలం రూ. 50 మాత్రమే చెల్లించి మీరు ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. అలాగే నోకాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఇది రూ. 2772 నుంచి ప్రారంభమవుతుంది. ఒకవేళ పాత మొబైల్ కనుక మీరు ఎక్స్ చేంజ్ చేస్తే రూ. 31,900 వరకూ తగ్గింపు లభించే అవకాశం ఉంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..