Strange Radio Waves: ఖగోళ పరిశోధనల్లో కీలక పరిణామం.. కీలక సంకేతాలు గుర్తింపు.. గ్రహాంతర వాసుల పనేనా?..

|

Oct 13, 2021 | 2:26 PM

Strange Radio Waves: ఏలియన్స్.. ఏలియన్స్.. ఏలియన్స్.. ఈ పేరే పెద్ద మిస్టరీ. ఉన్నాయో లేదో తెలియదు కానీ.. ప్రపంచ వ్యాప్తంగా జనాలకు ఒక రకమైన ఆసక్తిని పెంచుతున్నాయి.

Strange Radio Waves: ఖగోళ పరిశోధనల్లో కీలక పరిణామం.. కీలక సంకేతాలు గుర్తింపు.. గ్రహాంతర వాసుల పనేనా?..
Space
Follow us on

Strange Radio Waves: ఏలియన్స్.. ఏలియన్స్.. ఏలియన్స్.. ఈ పేరే పెద్ద మిస్టరీ. ఉన్నాయో లేదో తెలియదు కానీ.. ప్రపంచ వ్యాప్తంగా జనాలకు ఒక రకమైన ఆసక్తిని పెంచుతున్నాయి. ఏలియన్స్ ఉన్నాయా? ఉంటే ఎలా ఉంటాయి? ఎక్కడ ఉన్నాయి? వాటి మనుగడ ఏ విధంగా సాగుతోంది? భూమిని పోలిన గ్రహాలు విశ్వంలో ఇంకా ఉన్నాయా? జీవాసానికి అనుగుణమైన గ్రహాలు ఉన్నాయా? ఇలా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతూనే ఉన్నాయి. కానీ ఏ ప్రశ్నకూ ఇప్పటికి వరకు క్లారిటీ లేదు. కానీ, ప్రపంచ దేశాలన్నీ ఈ ఏలియన్స్ ని, భూమిని పోలిన మరో గ్రహాలను కనిపెట్టేందుకు విస్తృతమైన పరిశోధనలు చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో రకరకా థియరీలు పుట్టుకొచ్చాయి. పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇక అదుగో ఏలియన్ అని కొందరంటే.. ఇదుగో ఏలియన్ మేం చూశాం అని ఇంకొందరంటున్నారు. ఎహే అదంతా తూచ్ అని మరోవైపు అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అంటోంది.

ఇంతకీ ఏది నిజం అనుకునే లోపే ఏలియన్స్‌కు సంబంధించి, విశ్వంలో జీవ మనుగడకు అవాసంగా ఉండే గ్రహాలకు సంబంధించి మరో వార్త ప్రాచుర్యంలోకి వచ్చింది. అంతరిక్షం నుంచి కొత్త సంకేతాలు అందడం.. ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. మన సౌర వ్యవస్థకు ఆవల నుంచి వస్తున్న రేడియో సంకేతాలను తొలిసారిగా ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన రేడియో యాంటెన్నా ‘ద డచ్‌ లో-ఫ్రీక్వెన్సీ అరే’ (లోఫర్‌) సాయంతో పరిశోధకులు.. సుదూర నక్షత్రాల నుంచి వస్తున్న అసాధారణ సంకేతాలను గుర్తించారు. సాధారణ విధానాల్లో బయటపడని గ్రహాలను గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుందని పరిశోధకులు భావిస్తున్నారు.

తాజాగా 19 ‘అరుణ మరుగుజ్జు నక్షత్రాల’ నుంచి సిగ్నళ్లు గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు. వీటిలో నాలుగు నక్షత్రాల చుట్టూ ఇతర గ్రహాలు ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. వాటిపై ఏలియన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని పేర్కొన్నారు. వాస్తవానికి సౌరకుటుంబంలో గ్రహాలు శక్తివంతమైన రేడియో తరంగాలను వెదజల్లుతాయని మనకు తెలుసునని, కానీ ఇప్పుడు గుర్తించిన తరంగాలు చాలా డిఫరెంట్‌గా ఉన్నాయని పరిశోధకులు పేర్కొన్నారు. ఇలాంటి సిగ్నల్స్ ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదన్నారు. అయితే అరుణ మరుగుజ్జు నక్షత్రాల్లో తీవ్రస్థాయి అయస్కాంత చర్యలు ఉంటాయని, ఫలితంగా సౌర జ్వాలలు, రేడియో తరంగాలు వెలువడుతుంటాయని వివరించారు. ప్రస్తుతం అలాంటి తరంగాలనే గుర్తించామన్నారు. వీటిపై మరింత లోతైన విశ్లేషణ చేయాల్సి ఉందని సైంటిస్ట్‌లు పేర్కొన్నారు. అయితే, మరో సందేహాలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఇవి గ్రహాంతర వాసులు పంపిన సంకేతాలేనా? అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఏదేమైనా ఈ సందేహాలన్నింటికీ తాజాగా అందిన సిగ్నల్స్ ద్వారా సమాధానం చెప్పే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందని తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Also read:

Navaratri 8th Day Naivedyam: రేపు మహిషాసురమర్దని అవతారంలో అమ్మవారు.. నైవేద్యంగా స్వీట్ పొంగల్ .. తయారీ

Asamai Temple: తాలిబన్ల రాజ్యంలో ఘనంగా నవరాత్రి వేడుకలు.. ఆశామాయి ఆలయంలో హిందువులు, సిక్కుల భజనలు..

Rahul Gandhi: ఆ మంత్రిని కేబినెట్ నుంచి తొలగించాల్సిందే.. రాష్ట్రపతిని కోరిన కాంగ్రెస్ బృందం..