WhatApp New Feature: ఇక‌పై వాయిస్ మెసేజ్‌ల‌లో పొర‌పాటు జ‌ర‌గ‌దు.. కొత్త ఫీచ‌ర్ తీసుకొస్తున్న‌ వాట్సాప్‌..

|

May 04, 2021 | 5:45 AM

WhatApp New Feature: ప్ర‌పంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఉప‌యోగించే మెసేజింగ్ యాప్‌ల‌లో వాట్సాప్ ముందు వ‌రుస‌లో ఉంటుంది. ఎప్పటిక‌ప్పుడు కొంగొత్త ఫీచ‌ర్ల‌తో ఆక‌ట్టుకుంటోంది కాబ‌ట్టే...

WhatApp New Feature: ఇక‌పై వాయిస్ మెసేజ్‌ల‌లో పొర‌పాటు జ‌ర‌గ‌దు.. కొత్త ఫీచ‌ర్ తీసుకొస్తున్న‌ వాట్సాప్‌..
Whatsapp New Feature
Follow us on

WhatApp New Feature: ప్ర‌పంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉప‌యోగించే మెసేజింగ్ యాప్‌ల‌లో వాట్సాప్ ముందు వ‌రుస‌లో ఉంటుంది. ఎప్పటిక‌ప్పుడు కొంగొత్త ఫీచ‌ర్ల‌తో ఆక‌ట్టుకుంటోంది కాబ‌ట్టే వాట్సాప్‌కు ఇంత‌టి ఆద‌ర‌ణ‌ ల‌భించింది. అయితే గ‌త కొన్ని రోజుల క్రితం ప్రైవ‌సీ విష‌యంలో వాట్సాప్ కాస్త ఎదురుదెబ్బ ఎదుర్కొన్న విష‌యం తెల‌సిందే. యూజ‌ర్ల నుంచి వ్య‌తిరేక‌త రావ‌డంతో యాజ‌మాన్యం వెనుక‌డుగు వేసింది.
దీంతో కోల్పోయిన న‌మ్మ‌కాన్ని మ‌ళ్లీ రాబ‌ట్టుకోవ‌డానికి వాట్సాప్ కొత్త కొత్త ఫీచ‌ర్ల‌తో యూజర్ల‌ను ఆకట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఈ క్ర‌మంలో ఇటీవ‌లి కాలంలో ప‌లు అప్‌డేట్ల‌తో వ‌స్తోందీ మేసేజింగ్ యాప్‌. ఇందులో భాగంగానే మ‌రో కొత్త ఫీచ‌ర్‌ను తీసుకురానుంది. సాధార‌ణంగా మ‌నం వాయిస్ మెసేజ్‌ల‌ను పంపే స‌మ‌యంలో పునఃప‌రిశీలించుకోవ‌డానికి (రివ్యూ) అవ‌కాశం ఉండ‌దు. వాయిస్ రికార్డ్ చేయ‌గానే ఆటోమెటిగ్‌గా సెండ్ అవుతుంది. అయితే ఇక‌పై రికార్డు చేసిన వాయిస్ మెసేజ్‌ను రివ్యూ చూసుకునే అవ‌కాశం ల‌భించ‌నుంది. వాట్సాప్ తీసుకురానున్న ఈ కొత్త ఫీచ‌ర్‌తో ఈ స‌దుపాయం అందుబాటులోకి రానుంది. ప్ర‌స్తుతం వాట్సాప్ ఈ కొత్త ఫీచ‌ర్‌ను టెస్టింగ్ చేస్తోంది. ఇక రికార్డు చేసిన వాయిస్ మెసేజ్‌ను వినే వేగాన్ని కూడా యూజ‌ర్ ఎంచుకునే అవ‌కాశాన్ని ఈ ఫీచ‌ర్ ద్వారా అందించ‌నున్నారు. రికార్డ్ చేసిన వాయిస్ మెసేజ్‌ను పంపే స‌మ‌యంలో రివ్యూ బ‌ట‌న్ ద్వారా రికార్డు చేసిన మెసేజ్‌ను వినే అవ‌కాశం క‌ల్పించ‌నున్నారు.

Also Read: Viral: ల్యాండింగ్‌కు 20 నిమిషాల ముందు విమానం అదృశ్యం.. అంతుచిక్కని రహస్యం.. కట్ చేస్తే.!

Toll Plaza Lorry Accident: టోల్‌ ఫ్లాజా వద్ద లారీ బీభత్సం… అదుపుతప్పి దూసుకెళ్లిన వాహనం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

మీకు ఆధార్‌ కార్డుతో సమస్యలున్నాయా..? అయితే ఒక్క ఫోన్ కాల్ కొట్టండి మొత్తం క్లియర్..! ఎలాగో తెలుసుకోండి..