
కంప్యూటర్ విజన్ టెక్నాలజీతో పనిచేసే స్మార్ట్ రోబోలు పండిన పంటలను సులభంగా గుర్తించి, ఆటోమేటిగ్గా కోతలు పూర్తి చేస్తాయి. గంటకు 160 కిలోగ్రాముల పంటను విశ్రాంతి లేకుండా సేకరించే సామర్థ్యం వీటి సొంతం. ఈజిప్టులో మొదలైన ఈ ప్రస్థానం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఇజ్రాయెల్‌లో డ్రోన్ ఆధారిత ఫ్రూట్ హార్వెస్టింగ్ రోబోలు, అమెరికాలో స్ట్రాబెర్రీ, యాపిల్ వంటి పండ్ల సేకరణకు అధునాతన రోబోటిక్ టెక్నాలజీ అందుబాటులో ఉంది. యూకే, యూరప్ దేశాల్లోనూ వివిధ రకాల హార్వెస్టింగ్ రోబోలు వ్యవసాయ డిజిటలైజేషన్‌ను వేగవంతం చేస్తున్నాయి. చైనా, జపాన్ వంటి దేశాలు గ్రీన్‌హౌజ్ పంటల కోసం ప్రత్యేక రోబోలను అభివృద్ధి చేస్తున్నాయి.
భారతదేశంలో కూడా ఈ ఏఐ ఆధారిత స్మార్ట్ హార్వెస్టింగ్ రోబోటిక్ సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతోంది. పూర్తిగా హార్వెస్టింగ్ రోబోలు పరిమితంగా ఉన్నప్పటికీ, ఏఐ మరియు కంప్యూటర్ విజన్ ఆధారిత సిస్టమ్స్ విస్తృతంగా వాడుకలోకి వస్తున్నాయి. బెంగుళూరుకు చెందిన నికో రోబోటిక్స్ వంటి స్టార్టప్‌లు ప్రెసిషన్ స్ప్రేయింగ్, కలుపు తీసే రోబోలను రూపొందిస్తున్నాయి.
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థలు రక్షక్ వంటి ఏఐ లేజర్ వీడింగ్ రోబోలను, హార్వెస్టెడ్ రోబోలను తయారు చేస్తున్నాయి. అటానమస్ ఫార్మింగ్ రోబోల ద్వారా స్ప్రేయింగ్, ట్రాన్స్‌పోర్ట్ పనులు సులభమవుతున్నాయి. మహీంద్రా యూనివర్సిటీ, ఐసిఏఆర్ వంటి సంస్థలు ఈ రంగంలో కీలక పరిశోధనలు చేస్తున్నాయి.
ఈ రోబోటిక్ టెక్నాలజీ వల్ల పంటల వృథా భారీగా తగ్గుతుంది. కార్మికుల కొరత ఉన్న సమయంలో ఇవి గొప్ప ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. తద్వారా ఖర్చులు తగ్గి, ఉత్పాదకత మెరుగుపడుతుంది. ముఖ్యంగా కాటన్, టమాటా, స్ట్రాబెర్రీ, ఆపిల్ వంటి పంటల సేకరణలో ఇవి ఎంతో మేలు చేస్తాయి. కార్మికుల సమస్యలు, నీటి యాజమాన్యం, సవాళ్లను అధిగమించడానికి ఈ స్థానిక ఆవిష్కరణలు ఎంతో తోడ్పడతాయి.
రాబోయే రెండు మూడు సంవత్సరాలలో మన దేశీయ స్టార్టప్‌లు మరిన్ని అధునాతన హార్వెస్టింగ్ రోబోలను తీసుకువచ్చే అవకాశం ఉంది. సాంకేతికతను వ్యవసాయానికి జోడించడం ద్వారా సుస్థిరమైన, లాభదాయకమైన ఆహార ఉత్పత్తి సాధ్యమవుతుంది. ఈ డిజిటల్ పరివర్తన భారతీయ రైతుల జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకురావడమే కాకుండా, ప్రపంచ ఆహార భద్రతకు కూడా ఎంతో దోహదపడుతుంది.