Instagram: మీరు ఇన్‌స్టా స్టోరీ చూసినట్లు ఎదుటి వారికి తెలియకూడదా.. ఈ సింపుల్‌ ట్రిక్‌ ఫాలో అయితే సరి..

|

Aug 24, 2022 | 4:03 PM

Instagram: ఫేస్‌బుక్‌ (Facebook) తర్వాత ఆ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్న సోషల్‌ మీడియాలో యాప్స్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ మొదటి స్థానంలో ఉంటుంది. ఆ మాటకొస్తే ప్రస్తుతం యువత ఎక్కువగా అట్రాక్ట్‌ అవుతోంది ఈ సోషల్‌ మీడియా...

Instagram: మీరు ఇన్‌స్టా స్టోరీ చూసినట్లు ఎదుటి వారికి తెలియకూడదా.. ఈ సింపుల్‌ ట్రిక్‌ ఫాలో అయితే సరి..
Instagram
Follow us on

Instagram: ఫేస్‌బుక్‌ (Facebook) తర్వాత ఆ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్న సోషల్‌ మీడియాలో యాప్స్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ మొదటి స్థానంలో ఉంటుంది. ఆ మాటకొస్తే ప్రస్తుతం యువత ఎక్కువగా అట్రాక్ట్‌ అవుతోంది ఈ సోషల్‌ మీడియా సైట్‌కే అని చెప్పాలి. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తుంది కాబట్టే ఇన్‌స్టాగ్రామ్‌కు ఆ స్థాయిలో ఫాలోవర్లు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువగా పాపులర్‌ అయిన వాటిలో ముఖ్యమైంది ఇన్‌స్టా స్టోరీ ఒకటి. యూజర్లను తమ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు స్టోరీ రూపంలో పోస్ట్‌ చేస్తుంటారు. అయితే సహజంగా మనం ఇతరుల ఇన్‌స్టా స్టోరీలను చూస్తే వారికి మనం ఆ స్టోరీని చూసినట్లు తెలిసిపోతుంది.

అలా కాకుండా మనం ఎవరి స్టోరీని చూసినా వారికి మనం స్టోరీ చూసినట్లు తెలియకుండా ఉంటే ఎలా ఉంటుంది.? వినడానికి బాగానే ఉన్నా ఇందుకోసం ప్రత్యేకంగా ఎలాంటి ఫీచర్‌ లేదని ఆలోచిస్తున్నారు కదూ.! అయితే ఇందుకోసమే ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆసక్తికరమైన ట్రిక్‌ అందుబాటులో ఉంది. దీని ద్వారా మీరు ఎవరి ఇన్‌స్టా స్టోరీని చూసినా వారికి తెలియదు. ఇంతకీ ఆ ట్రిక్‌ ఏంటి.? ఇందుకోసం ఫాలో కావాల్సిన స్టెప్స్‌ ఏంటి.? లాంటి వివరాలు మీకోసం.. ఎదుటి వారికి తెలియకుండా స్టోరీలను చూడడానికి రెండు మార్గాలు ఉన్నాయి.

అందులో ఒకటి ఎరోప్లెయిన్‌ మోడ్‌. ఇందుకోసం ముందుగా ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను ఓపెన్‌ చేయాలి. అనంతరం ఇన్‌స్టా స్టోరీలన్నీ లోడ్‌ కావడానికి కొద్ది సమయం వెయిట్‌ చేసి. తర్వాత ఎరోప్లెయిన్‌ మోడ్‌ను ఆన్ చేయాలి. అనంతరం మీకు నచ్చిన స్టోరీని ఓపెన్‌ చేయాలి. ఇలా చేస్తే మీరు స్టోరీ చూసినా వారికి చూసినట్లు కనిపించదు. రెండో ఆప్షన్‌ వెబ్‌ ద్వారా.. ఇందు కోసం ముందుగా గూగుల్‌ క్రోమ్‌లో ఐజీ స్టోరీ క్రోమ్‌ ఎక్స్‌టెన్షన్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. అనతరం సిస్టమ్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ వెబ్‌ వెర్షన్‌ను ఓపెస్‌ చేసి లాగిన్‌ కావాలి. ఇలా క్రోమ్‌ ఎక్స్‌ టెన్షన్‌లో ఇతరులకు తెలియకుండా వారి స్టోరీస్‌ చూసేయొచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..