మాంచి కొనాలని భావిస్తున్నారా? అయితే, అంత బడ్జెట్ పెట్టలేక చింతిస్తున్నారా? మరేంపర్వాలేదు. ఆ చింత వీడండి. శాంసంగ్ నుంచి అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వస్తోంది. అలాగని ఫీచర్స్ ఏమీ తక్కువగా లేవండోయ్.. వావ్ అనిపించే ఫీచర్స్ ఈ స్మార్ట్ ఫోన్లో ఉన్నాయి. శాంసంగ్ తన కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Samsung Galaxy F04 ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. మీడియాటెక్ ప్రాసెసర్ కలిగిన ఈ ఫోన్ సేల్ డేట్, హ్యాండ్సెట్ ఫీచర్స్, ధర వంటి వివరాలను విడుదల చేసింది శాంసంగ్. ఆ వివరాలన్ని ఇప్పుడు చూద్దాం..
శాంసంగ్ నుంచి వస్తున్న ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ధర రూ. 7,499 నుంచి ప్రారంభమవుతుంది. 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర ఇలా ఉంటుంది. అయితే, ఇది లాంచింగ్ ఆఫర్ ప్రైజ్ మాత్రమే. ఆఫర్ ముగిస్తే.. దీని ధర రూ. 9,499గా నిర్ణయించారు. ఈ మొబైల్ ప్రముఖ ఇ-కామర్స్ సైట్ Flipkart లో అందుబాటులో ఉండనుంది. జనవరి 12 నుంచి ఈ స్మార్ట్ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. కాగా, ఫోన్ రెండు కలర్స్‌లో వస్తోంది. ఒకటి ఓపల్ గ్రీన్, జెడ్ పర్పుల్ రంగుల్లో అందుబాటులో ఉండనుంది.
ఈ ఫోన్లో 6.5-అంగుళాల HD ప్లస్ LCD డిస్ప్లే ఉంది. 1600 × 720 పిక్సెల్ రిజల్యూషన్‌ను అందిస్తుంది. 60Hz రిఫ్రెష్ రేట్, ఆండ్రాయిడ్ 12 ఆధారంగా వన్ UI 4.1పై ఫోన్ పనిచేస్తుంది. కాగా, ఈ ఫోన్ రెండు ఆండ్రాయిడ్ వెర్షన్లను పొందుతుంది. ఇక ఇందులోని సాఫ్ట్వేర్ కూడా అద్భుతంగా ఉంది. MediaTek Helio P35 చిప్సెట్తో, గ్రాఫిక్స్ కోసం IMG PowerVR GE8320 GPU ఉంది. దీంతో పాటు ఈ ఫోన్లు 4 GB RAM నుంచి 8GB RAM వరకు వేరియంట్స్లలో ఉంది. స్టోరేజ్ 64 జీబీతో పాటు.. ఎస్డి కార్డు సహాయంతో స్టోరేజీని పెంచుకునే వెసులుబాటు కూడా ఉంది.
కెమెరా సెటప్: ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఇవ్వబడం జరిగింది. 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్‌తో 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా సెన్సార్ ఉంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సార్ ఉంది.
బ్యాటరీ కెపాసిటీ: Samsung F సిరీస్ కింద విడుదల చేసిన ఈ తాజా ఫోన్లో USB టైప్-C పోర్ట్ ద్వారా 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. 5000 mAh బ్యాటరీ బ్యాకప్ ఇవ్వడం జరిగింది.
కనెక్టివిటీ: డ్యూయల్-సిమ్ 4G, బ్లూటూత్ వెర్షన్ 5, Wi-Fi, GPS సపోర్ట్‌తో ఉన్న ఈ శాంసంగ్ ఫోన్లో ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ఉంది. అయితే, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఈ ఫోన్‌కు ఇవ్వలేదు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..