Samsung Galaxy a04: సామ్‌సంగ్‌ నుంచి కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది.. రూ. 10 వేలలోనే 50 మెగాపిక్సెల్ కెమెరా..

Samsung Galaxy a04: దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజం మళ్లీ ఇండియన్‌ మార్కెట్లో తన సత్తా చాటడానికి సిద్ధమవుతోంది. షావోమి, రియల్‌మీ లాంటి చైనా ఫోన్‌ల సందడి బాగా పెరిగిన నేపథ్యంలో బడ్జెట్‌ ఫోన్‌లను తీసుకొచ్చే పనిలో పడింది...

Samsung Galaxy a04: సామ్‌సంగ్‌ నుంచి కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది.. రూ. 10 వేలలోనే 50 మెగాపిక్సెల్ కెమెరా..
Samsung Galaxy A04

Updated on: Aug 25, 2022 | 4:18 PM

Samsung Galaxy a04: దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజం మళ్లీ ఇండియన్‌ మార్కెట్లో తన సత్తా చాటడానికి సిద్ధమవుతోంది. షావోమి, రియల్‌మీ లాంటి చైనా ఫోన్‌ల సందడి బాగా పెరిగిన నేపథ్యంలో బడ్జెట్‌ ఫోన్‌లను తీసుకొచ్చే పనిలో పడింది. ఇందులో భాగంగా ఇప్పటికే A సిరీస్‌లో ఫోన్‌లను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఇదే సిరీస్‌లో భాగంగా గ్యాలక్సీ A04 పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. త్వరాలోనే మార్కెట్లోకి అందుబాటులోకి రానున్న ఈ స్మార్ట్‌ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు, ధర ఎలా ఉండనున్నాయో ఓ లుక్కేయండి..

సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఏ04 స్మార్ట్‌ఫోన్‌లో 6.5 ఇంచెస్‌ హెచ్‌డీ + స్క్రీన్‌ను ఇస్తున్నారు. 60 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో కూడిన ఇన్ఫినిటీ V డిస్‌ప్లే ఈ ఫోన్‌ సొంతం. ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్‌లో ఆక్టాకోర్‌ ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను మొత్తం మూడు వెర్షన్స్‌లో విడుదల చేయనున్నారు. వీటిలో 4జీబీ ర్యామ్‌ + 32 జీబీ స్టోరేజ్‌, 6 జీబీ ర్యామ్‌ + 64 జీబీ స్టోరేజ్‌, 8 జీబీ ర్యామ్‌ + 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్స్‌తో తీసుకురానున్నారు.

ఇవి కూడా చదవండి

కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్ రెయిర్‌ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 5 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌కెమెరాను ఇవ్వనున్నారు. ఇక 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఈ ఫోన్‌ సొంతం. ధర విషయానికొస్తే బేసిక్‌ మోడల్‌ రూ. 10 వేల నుంచి ఉండనున్నట్లు సమాచారం. ధరపై క్లారిటీ రావాలంటే ఫోన్‌ లాంచింగ్‌ వరకు వేచి చూడాలి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us