
Samsung Galaxy S25 Edge: శాంసంగ్ కంపెనీ కొత్త స్మార్ట్‌ఫోన్ శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్‌ను మే నెలలో వినియోగదారుల కోసం లాంచ్ చేయవచ్చు. అధికారికంగా ప్రారంభించటానికి ముందే ఈ రాబోయే ఫోన్ స్పెసిఫికేషన్లు, ధరకు సంబంధించిన సమాచారం లీక్ అయింది. జర్మన్ ప్రచురణ అయిన WinFuture ఈ Samsung స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్‌లను లీక్ చేసింది. ముఖ్యమైన ఫీచర్ గురించి చెప్పాలంటే టైటానియం ఫ్రేమ్‌తో వచ్చే ఈ ఫోన్ ముందు, వెనుక భాగంలో గ్లాస్ డిజైన్‌ను ఉపయోగించవచ్చు. లాంచ్ చేయడానికి ముందు ఈ ఫోన్‌లో ఏ ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయో, ఈ హ్యాండ్‌సెట్ ధర ఎంత ఉంటుందో తెలుసుకుందాం.
డిస్‌ప్లే: లీక్‌ల నుండి అందిన సమాచారం ప్రకారం.. Samsung Galaxy S25 Edge 6.7-అంగుళాల AMOLED స్క్రీన్‌ను కలిగి ఉండవచ్చు. 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో వచ్చే ఈ ఫోన్‌లో స్క్రీన్ రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సిరామిక్ 2, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 లను ఉపయోగించవచ్చు.
ప్రత్యేక ఫీచర్స్‌లు: దుమ్ము, నీటి నిరోధకత వంటి లక్షణాలతో పాటు, ఈ ఫోన్ భద్రత కోసం అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
ప్రాసెసర్: వేగం, మల్టీ టాస్కింగ్ కోసం, గెలాక్సీ S25 ఎడ్జ్‌లో 12 GB RAM, 512 GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉంటుంది.
కెమెరా సెటప్: ఈ ఫోన్ వెనుక భాగంలో 200-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్‌తో పాటు 12-మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది. ఇది కాకుండా సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 12-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సార్ అందుబాటులో ఉంటుంది.
కనెక్టివిటీ: Wi-Fi 7తో వచ్చే ఈ Samsung స్మార్ట్‌ఫోన్, బ్లూటూత్ వెర్షన్ 5.4 సపోర్ట్ వంటి అనేక ఇతర ప్రత్యేక ఫీచర్లతో కూడా అందించబడుతుంది.
బ్యాటరీ సామర్థ్యం: ఈ ఫోన్‌కు ప్రాణం పోసేందుకు శక్తివంతమైన 3900mAh బ్యాటరీని ఇవ్వవచ్చు. కానీ ప్రస్తుతం ఈ ఫోన్ ఎన్ని వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యంతో లాంచ్ అవుతుందనే దానిపై ఎటువంటి సమాచారం లేదు.
జర్మనీలో శాంసంగ్‌కు చెందిన ఈ రాబోయే ఫ్లాగ్‌షిప్ ఫోన్ 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర 1249 యూరోలు (సుమారు 1 లక్ష 19 వేల రూపాయలు), 512 GB టాప్ వేరియంట్ ధర 1369 యూరోలు (సుమారు 1 లక్ష 30 వేల రూపాయలు) కావచ్చు. ఈ ధర పరిధిలో ఈ ఫోన్ ఐఫోన్ 16 ప్రోకి గట్టి పోటీని ఇవ్వగలదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి