Samsung M32: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న శాంసంగ్ గెలాక్సీ ఎం32 ఇండియాకి రాను వచ్చింది. దక్షిణ కొరియా మొబైల్ తయారీ కంపెనీ శాంసంగ్ తన గెలాక్సీ ఎం32 స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం నాడు భారత మార్కెట్‌లో విడుదల చేసింది. అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఈ ఫోన్ ధర రూ. 14,999 నుంచి ప్రారంభమవుతోంది. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లభించనుంది. కొత్త శాంసంగ్ బడ్జెట్ ఆండ్రాయిడ్ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
శామ్‌సంగ్ గెలాక్సీ ఎం32 స్మార్ట్ ఫోన్.. 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డి+సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. శామ్సంగ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. హై బ్రైట్‌నెస్ మోడ్ సెల్ఫ్‌కంట్రోల్ ఫీచర్ ఇందులో ఉంది. అలాగే.. ఈ మొబైల్ ఆక్టా-కోర్ మెడిటెక్ హెలియో జి 80 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. గెలాక్సీ ఎం32 రెండు మెమరీ వేరియంట్లలో వస్తుంది. ఒకటి 4 జిబి+ 64 జిబి, రెండవది 6 జిబి+128 జిబి. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్, వన్ యుఐ 3.1 ఇంటర్‌ఫేస్‌ను బాక్స్ ఔట్‌సైడ్ అందిస్తుంది. గెలాక్సీ ఎం32.. శామ్‌సంగ్ నాక్స్ 3.7 తో వస్తుంది. ఇది ఎక్కువ సెక్యూరిటీ ఫీచర్లను కలిగి ఉంది. అలాగ్ AltZLife ఫీచర్ ఉంది. ఇది వినియోగదారులు నార్మల్ మోడ్, ప్రైవేట్ మోడ్ సెలక్ట్ చేసుకునే అవకాశం ఉంది.
కెమెరా..
శాంసంగ్ గెలాక్సీ ఎం32 లో 64 ఎంపి క్వాడ్ కెమెరా, 20 ఎంపి ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. బ్యాక్ కెమెరాలో 64 ఎంపి ప్రధాన కెమెరా ఉండగా.. 8 ఎంపి అల్ట్రా-వైడ్ కెమెరా ఉంది. ఇది వినియోగదారులకు 123 డిగ్రీల ఫీల్డ్ వ్యూతో ప్రకృతి దృశ్యాలను తీయడానికి వీలు కల్పిస్తుంది. 2 ఎంపి మాక్రో లెన్స్ ఉంది. అలాగే పోర్ట్రెయిట్ మోడ్ కోసం మరో 2MP సెన్సార్ ఉంది. హైపర్ లాప్స్, స్లో మోషన్, ఫుడ్ మోడ్, ప్రో మోడ్, ఎఆర్ జోన్ వంటి కెమెరా ఫీచర్లు కూడా ఉన్నాయి.
బ్యాటరీ లైఫ్..
శాంసంగ్ గెలాక్సీ ఎం32.. 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది 25W ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. దాంతోపాటు ఇన్-బాక్స్ 15W ఫాస్ట్ ఛార్జర్‌తో వస్తుంది. ఈ ఫోన్ 130 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, 40 గంటల టాక్ టైమ్, 25 గంటల వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎం32 ధర..
శాంసంగ్ గెలాక్సీ ఎం32 రెండు మెమరీ వేరియంట్లలో వస్తుంది. ఒకటి 4 జిబి + 64 జిబి, రెండవది 6 జిబి + 128 జిబి. వీటి ధర వరుసగా రూ .14,999, రూ .16,999. గెలాక్సీ ఎం32 బ్లాక్, లైట్ బ్లూ రెండు రంగులలో అందుబాటులో ఉంది. ఇది అమెజాన్, శామ్సంగ్.కామ్, అన్ని ముఖ్యమైన రిటైల్ స్టోర్లలో లభిస్తుంది. లాంచ్ ఆఫర్‌లో భాగంగా, కొనుగోలుదారులు ఐసిఐసిఐ కార్డులతో చెల్లింపులు జరిపినట్లయితే.. రూ.1250 ఇన్‌స్టాంట్ క్యాష్ బ్యాక్ పొందవచ్చు. అంతే.. 4 జిబి + 64 జిబి వేరియంట్ మొబైల్‌ను రూ.13,749 లకు లభిస్తుండగా.. 6 జిబి + 128 జిబి వేరియంట్ రూ .15,749 లకు లభిస్తుంది.
Also read:
Kondapindi Aaku Pappu: కిడ్నీ స్టోన్స్ ను కరిగించే కొండపిండాకు పప్పు కూర తయారీ విధానం
మహిళల వస్త్రధారణపై పాక్ ప్రధాని ఇమ్రాన్ చెత్త కామెంట్:PM Imran Khan