Sadhguru’s Meditation App: చాట్‌జిపిటిని అధిగమించిన సద్గురు ‘మిరాకిల్ ఆఫ్ మైండ్’.. 15 గంటల్లో 1 మిలియన్ డౌన్‌లోడ్‌లు

Miracle of Mind App: ఆధ్యాత్మిక గురువు సద్గురు ప్రారంభించిన ఉచిత ధ్యాన యాప్ మిరాకిల్ ఆఫ్ మైండ్ కేవలం 15 గంటల్లోనే 1 మిలియన్ డౌన్‌లోడ్‌లను దాటింది. ఇది చాట్‌జిపిటిని సైతం అధిగమించింది. జీవిత ఒత్తిడి నుండి తప్పించుకోవడానికి మీరు గంటల తరబడి ధ్యానం చేస్తూ కూర్చోవాల్సిన అవసరం లేదు..

Sadhgurus Meditation App: చాట్‌జిపిటిని అధిగమించిన సద్గురు మిరాకిల్ ఆఫ్ మైండ్.. 15 గంటల్లో 1 మిలియన్ డౌన్‌లోడ్‌లు

Updated on: Mar 02, 2025 | 10:12 PM

ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ కొత్తగా ప్రారంభించిన ఉచిత ధ్యాన యాప్ ‘మిరాకిల్ ఆఫ్ మైండ్’ కొత్త చరిత్ర సృష్టించింది. శివరాత్రి నాడు విడుదలైన ఈ మొబైల్ అప్లికేషన్‌ను కేవలం 15 గంటల్లోనే 1 మిలియన్ మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. దీనితో ‘మిరాకిల్ ఆఫ్ మైండ్’ యాప్ ChatGPTని అధిగమించింది.

మహాశివరాత్రి (ఫిబ్రవరి 26) నాడు ప్రారంభించబడిన ఈ యాప్ ఇప్పుడు భారతదేశం, అమెరికా, కెనడా, UK, ఆస్ట్రేలియా, జర్మనీతో సహా 20 దేశాలలో ట్రెండింగ్‌లో ఉంది. ఇంగ్లీష్, హిందీ, తమిళం, రష్యన్, స్పానిష్ భాషలలో లభించే మిరాకిల్ ఆఫ్ మైండ్ యాప్, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకునే లక్ష్యంతో AI- ఆధారిత ఫీచర్‌తో ప్రవేశపెట్టారు.

 


జీవిత ఒత్తిడి నుండి తప్పించుకోవడానికి మీరు గంటల తరబడి ధ్యానం చేస్తూ కూర్చోవాల్సిన అవసరం లేదు. ఈ యాప్ కేవలం ఏడు నిమిషాల్లో మీ మనసును ప్రశాంతపరుస్తుంది. ఈ యాప్‌లో సద్గురు బోధనలతో పాటు పూర్తి ధ్యాన సమాచారాన్ని అందించే AI-ఆధారిత ఇంటెలిజెన్స్ సాధనం ఉంటుందని చెబుతున్నారు.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి