449 ప్లాన్: జియో కంటే ఎయిర్‌టెల్ బెటర్.. ఎందుకో తెలుసా?

స్మార్ట్ ఫోన్‌లలో డేటా రీఛార్జ్ చేసే సమయంలో ఆయా టెలిఫోన్ సంస్థలు అందిస్తున్న ప్లాన్లను ఒకసారి గమనిస్తే మంచిది. కొన్ని సందర్భాల్లో ఒకే రేటు ఉన్నప్పటికీ ఒక సంస్థ తక్కువ, మరో సంస్థ ఎక్కువ డేటాను అందిస్తుంటాయి. వీటిని గమనించి ఏ నెట్‌వర్క్ రీఛార్జ్ చేసుకోవాలని నిర్ణయించుకోవాలి.

449 ప్లాన్: జియో కంటే ఎయిర్‌టెల్ బెటర్.. ఎందుకో తెలుసా?
Airtel Vs Jio

Updated on: Jan 01, 2026 | 6:52 PM

స్మార్ట్ ఫోన్‌లలో డేటా రీఛార్జ్ చేసే సమయంలో ఆయా టెలిఫోన్ సంస్థలు అందిస్తున్న ప్లాన్లను ఒకసారి గమనిస్తే మంచిది. కొన్ని సందర్భాల్లో ఒకే రేటు ఉన్నప్పటికీ ఒక సంస్థ తక్కువ, మరో సంస్థ ఎక్కువ డేటాను అందిస్తుంటాయి. వీటిని గమనించి ఏ నెట్‌వర్క్ రీఛార్జ్ చేసుకోవాలని నిర్ణయించుకోవాలి. తాజాగా, రూ. 449 రీఛార్జ్ ప్లాన్లను ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో ఈ రెండు సంస్థలు అందిస్తున్నాయి. రేటు ఒకేలా ఉన్నప్పటికీ పొందే ప్రయోజనాలు మాత్రం వేరుగా ఉన్నాయి.

ఎయిర్‌టెల్ 449 ప్లాన్

ఎయిర్‌టెల్ రూ. 449 ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకుంటే రోజుకు 4జీబీ హైస్పీడ్ డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంస్‌లను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ 28 రోజులపాటు చెల్లుబాటులో ఉంటుంది. 4జీబీ రోజువారీ డేటా 28 రోజులపాటు చెల్లుబాటుతోపాటు మొత్తంగా 112జీబీ డేటాను అందిస్తుంది. అదనపు ప్రయోజనాల విషయానికొస్తే 30జీబీ గూగుల్ వన్ స్టోరేజ్, 28 రోజులపాటు ఓటీటీ యాప్ లకు యాక్సెస్, అపరిమితి 5జీ డేటా, స్పామ్ అలర్ట్స్, Perplexity Pro అందిస్తోంది.

జియోలో రూ. 449 ప్లాన్

రిలయన్స్ జియో నుంచి వచ్చిన ఈ ప్లాన్ రోజుకు 3జీబీ హైస్పీడ్ డేటాతోపాటు అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లను అందిస్తుంది. ఈ ప్లాన్ 28 రోజులపాటు చెల్లుబాటులో ఉంటుంది. రోజుకు 3జీబీ చొప్పున ప్లాన్ మొత్తం 84 జీబీ హైస్పీడ్ డేటాను అందిస్తుంది. అదనపు ప్రయోజనాలుగా జియో టీవీ, జియో క్లౌడ్ స్టోరేజ్ ఉన్నాయి.

బెటర్ ఆప్షన్ ఇదే

ఈ రెండింటిలో తేడాను గమనించినట్లయితే.. ఎయిర్‌టెల్ రూ. 449కి జియో కంటే ఎక్కువ డేటాను అందిస్తుంది. ఎయిర్‌టెల్ ప్లాన్ జియో కంటే రోజుకు 1 జీబీ డేటాను అదనంగా అందిస్తోంది. రెండు ప్లాన్లలోనూ కాలింగ్, ఎస్ఎంస్ ప్రయోజనాలు ఒకేలా ఉన్నాయి. అదనపు ప్రయోజనాలు మాత్రం తేడాగా ఉన్నాయి. రూ.449 ప్లాన్‌లో డేటా అదనంగా పొందాలనుకుంటే మాత్రం ఎయిర్‌టెల్ ప్లాన్ ను ఎంచుకుంటే బెటర్.