పెట్రోల్‌, డీజిల్‌ కార్లు ఉన్నవారికి గుడ్‌న్యూస్‌! అప్‌గ్రేడ్‌ కోసం రూ.50 వేలు ఫ్రీగా ఇవ్వనున్న ప్రభుత్వం

ఢిల్లీ ప్రభుత్వం EV పాలసీ 2.0లో భాగంగా పెట్రోల్ లేదా డీజిల్ కార్లను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకోవడానికి రూ.50,000 ఆర్థిక ప్రోత్సాహకం అందిస్తోంది. కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ పథకం ద్వారా, రెట్రోఫిట్టింగ్ ద్వారా పాత కార్లను EVలుగా మార్చవచ్చు.

పెట్రోల్‌, డీజిల్‌ కార్లు ఉన్నవారికి గుడ్‌న్యూస్‌! అప్‌గ్రేడ్‌ కోసం రూ.50 వేలు ఫ్రీగా ఇవ్వనున్న ప్రభుత్వం
Car

Updated on: Jan 06, 2026 | 10:24 PM

సొంత కారు, అది కూడా పెట్రోల్‌, డీజిల్తో నడుస్తుంటే, దాన్ని అప్గ్రేడ్చేసి ఎలక్ట్రిక్కారుగా మార్చుకుంటే ప్రభుత్వం రూ.50 వేల ఆర్థిక ప్రోత్సాహం ఇవ్వనుంది. అయితే ఆఫర్కేవలం ఢిల్లీ వాసులకే ఉంది. EV పాలసీ 2.0లో భాగంగా కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ రాష్ట్రప్రభుత్వం ప్లాన్ను రూపొందించింది. కొత్త EV అమ్మకాలను ప్రోత్సహించడంతో పాటు విధంగా కూడా మార్పు తేవాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది.

ప్రస్తుత EV పాలసీని మార్చి 2026 వరకు లేదా సవరించిన పాలసీని నోటిఫై చేసే వరకు పొడిగించారు. ప్రజా సంప్రదింపుల తర్వాత 2026 మొదటి త్రైమాసికంలో కొత్త పాలసీని విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ ప్రతిపాదన ప్రకారం పెట్రోల్ లేదా డీజిల్ కార్లను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే వారికి రూ.50,000 ప్రోత్సాహకాన్ని అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ప్రయోజనం మొదటి 1,000 కార్లకు మాత్రమే అందించే అవకాశం కూడా ఉంది.

రెట్రో ఫిట్టింగ్తో మార్పు..

రెట్రోఫిట్టింగ్ అంటే అంతర్గత దహన యంత్రం, సంబంధిత భాగాలను ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌తో భర్తీ చేయడం ద్వారా ఇప్పటికే ఉన్న పెట్రోల్ లేదా డీజిల్ వాహనాన్ని ఎలక్ట్రిక్ వాహనంగా మార్చడం. ఈ విధానం వాహన యజమానులు క్లీనర్ టెక్నాలజీకి మారుతూ తమ కారును ఉంచుకోవడానికి అనుమతిస్తుంది. రాబోయే రోజుల్లో, ప్రభుత్వం ఆర్అండ్డీ (రిసెర్చ్అండ్డెవలప్మెంట్‌)లో ఎక్కువ పెట్టుబడి పెడుతుందని. రెట్రోఫిట్టింగ్ రంగాన్ని అధ్యయనం చేయడానికి నిపుణులను నియోగిస్తుందని రవాణా శాఖ అధికారి ఒకరు తెలిపారు.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి