JIO New Plans: కొత్త రీఛార్జ్ ప్లాన్స్ తీసుకొచ్చిన జియో.. వీటితో డేటా వినియోగానికి నో లిమిట్‌..

|

Jun 12, 2021 | 10:02 PM

JIO New Plans: జియో రాక‌తో ఇంట‌ర్‌నెట్ వినియోగం బాగా పెరిగింది. వేగ‌మైన ఇంట‌ర్‌నెట్‌ను అందించే 4జీ సేవ‌ల‌ను అత్యంత త‌క్కువ ధ‌ర‌కు అందిచండంతో వినియోగ‌దారులు జియోకు పెద్ద ఎత్తున క్యూ క‌ట్టారు. అత్యంత త‌క్కువ...

JIO New Plans: కొత్త రీఛార్జ్ ప్లాన్స్ తీసుకొచ్చిన జియో.. వీటితో డేటా వినియోగానికి నో లిమిట్‌..
Jio Reacharge Offers
Follow us on

JIO New Plans: జియో రాక‌తో ఇంట‌ర్‌నెట్ వినియోగం బాగా పెరిగింది. వేగ‌మైన ఇంట‌ర్‌నెట్‌ను అందించే 4జీ సేవ‌ల‌ను అత్యంత త‌క్కువ ధ‌ర‌కు అందిచండంతో వినియోగ‌దారులు జియోకు పెద్ద ఎత్తున క్యూ క‌ట్టారు. అత్యంత త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ మందిని ఆక‌ర్షించిన సంస్థగా జియో రికార్డు సృష్టించింది. ఎప్ప‌టిక‌ప్ప‌డు వినియోగ‌దారుల అవ‌స‌రాల‌కు అనుగుణంగా రీఛార్జ్ ప్లాన్‌ల‌ను స‌వ‌రిస్తుంది కాబ‌ట్టే జియోకు ఇంత ఆద‌ర‌ణ పెరిగింది. ఈ క్ర‌మంలో తాజాగా జియో మ‌రో ఆక‌ర్షణీయమైన ఆఫ‌ర్ల‌తో వినియోగ‌దారుల ముందుకు వ‌చ్చింది.
సాధారంగా రోజుకు కేటాయించిన డేటాను మాత్ర‌మే వినియోగించుకునే అవ‌కాశం ఉంటుంది. కానీ కొన్ని సంద‌ర్బాల్లో నిర్ణీత డేటా కంటే ఎక్కువ డేటా ఉప‌యోగిస్తుంటాం. దీంతో ఆ రోజు లిమిట్‌ పూర్తయితే వేగం నెమ్మదిస్తుంది. అంటే మళ్లీ వేరే డేటా ప్లాన్‌ను వేసుకోవాలి. లేదంటే తర్వాతి రోజు వరకూ ఆగాలి. దీనికి చెక్ పెడుతూనే జియో.. కొత్త రీఛార్జ్ ఆఫ‌ర్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్లు రీఛార్చ్ చేసుకుంటే.. రోజువారీ లిమిట్ లేకుండా మొత్తం డేటాను పూర్తయ్యే వ‌ర‌కు వినియోగించు కోవ‌చ్చు.

Jio Recharge Plans

జియో కొత్త ఆఫ‌ర్లు ఇవే..

* రూ. 127 ప్లాన్‌తో 15 రోజుల పాటు 12 జీబీ డేటా అందిస్తారు.
* రూ. 247 రీఛార్జ్‌తో 30 రోజుల వ్యాలిడిటీతో 25 జీబీ డేటాను అందిస్తారు.
* రూ. 447 రీఛార్జ్‌తో 60 రోజుల వ్యాలిడిటీతో 50 జీబీ డేటా పొందొచ్చు.
* రూ. 597 రీఛార్జ్‌తో 90 రోజుల వ్యాలిడిటీతో 75 బీజీ డేటా పొందొచ్చు.
* రూ. 2397 ప్లాన్‌తో 365 రోజుల‌కు 365 జీబీ డేటా అందిస్తారు.
పైన పేర్కొన్న అన్ని ప్లాన్ల‌తో పాటు గతం మాదిరిగానే అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, డైలీ 100 ఎస్సెమ్మెస్‌లతో పాటు జియో యాప్స్‌ ఉచితంగా లభిస్తాయి.

Also Read: Kambalapally kathalu : చాప్టర్ 2 కు సిద్దమవుతున్న కంబాలపల్లి కథలు.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులు..

Yadadri Temple : పసిడి వర్ణ విద్యుత్ దీప కాంతుల్లో మెరిసిపోతున్న యాదాద్రి..! చూడటానికి వేయి కళ్లు సరిపోవు..

Zodiac Signs: ఈ నాలుగు రాశుల వారు మహా మొండివారు..వారితో వాదన కష్టం..ఏ రాశుల వారంటే..