JIO Telugu States: తెలుగు రాష్ట్రాల జియో యూజ‌ర్ల‌కు గుడ్ న్యూస్‌… రెట్టింపు కానున్న డేటా వేగం..

|

May 21, 2021 | 12:47 PM

JIO Telugu States: టెలికాం రంగంలో సంచ‌ల‌నంగా దూసుకొచ్చింది రిల‌య‌న్స్ జియో. వినియోగ‌దారుల‌కు స‌రికొత్త ఇంట‌ర్నెట్ అనుభ‌వాన్ని ప‌రిచయం చేసిన జియో. ఇంట‌ర్‌నెట్‌ ధ‌ర‌ల‌ను కూడా సామాన్యుల‌కు...

JIO Telugu States: తెలుగు రాష్ట్రాల జియో యూజ‌ర్ల‌కు గుడ్ న్యూస్‌... రెట్టింపు కానున్న డేటా వేగం..
Jio Speed In Telugu States
Follow us on

JIO Telugu States: టెలికాం రంగంలో సంచ‌ల‌నంగా దూసుకొచ్చింది రిల‌య‌న్స్ జియో. వినియోగ‌దారుల‌కు స‌రికొత్త ఇంట‌ర్నెట్ అనుభ‌వాన్ని ప‌రిచయం చేసిన జియో. ఇంట‌ర్‌నెట్‌ ధ‌ర‌ల‌ను కూడా సామాన్యుల‌కు చేరువ‌చేసింది. ఇక 4జీ సేవ‌ల్లోనూ ప్ర‌త్యేక‌త చాటుకుంటున్న జియో తాజాగా తెలుగు రాష్ట్రాల యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకునే క్ర‌మంలో నెట్‌వ‌ర్క్ సామ‌ర్థ్యాన్ని మ‌రింత విస్త‌రించే ప‌నిలో ప‌డింది. ఇందులో భాగంగా 20 ఎమ్‌హెచ్‌జెడ్ స్పెక్ట్ర‌మ్‌తో బ‌లోపేతం చేయ‌నుంది. దీంతో యూజ‌ర్ల‌కు డేటా వేగం రెట్టింపుకానుంది. అంతేకాకుండా మ‌రింత మెరుగైన 4జీ సేవ‌లు అందుబాటులోకి రానున్నాయి.
తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న 40 ఎమ్‌హెచ్‌జెడ్ స్పెక్ట్రం ల‌భ్య‌త ఇప్పుడు 50 శాతం పెర‌గ‌నుంది. దీంతో నెట్‌వ‌ర్క్ సామ‌ర్థ్యం 60 ఎమ్‌హెచ్‌జెడ్‌కు చేరుకోనుంది. ఈ ఫ‌లితంగా మెరుగైన 4జీ సేవ‌లు అందుబాటులోకి రానున్నాయి. ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం ఏపీ, తెలంగాణ‌లో జియో 3.16 కోట్లకు పైగా యూజ‌ర్ల‌తో 40 శాతం మార్కెట్ వాటాను చేజిక్కించుకొని జియో మొద‌టి స్థానంలో కొన‌సాగుతోంది. ఇక ప్ర‌స్తుత క‌రోనా నేప‌థ్యంలో డేటా వినియోగం విప‌రీతంగా పెర‌గ‌డం, ఉద్యోగుల నుంచి మొద‌లు విద్యార్థుల వ‌ర‌కు ఆన్‌లైన్‌లో వాడ‌కంతో ఇంటర్నెట్‌కు డిమాండ్ పెరిగింది. ఇందులో భాగంగానే ఇంకా పెద్ద మొత్తంలో యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు గాను జియో.. నెట్‌వ‌ర్క్ సామ‌ర్థ్యాన్ని పెంచిన‌ట్లు తెలుస్తోంది.

Also Read: INS Rajput : నలభైఒక్కేళ్లపాటు భారత నావికాదళానికి కొండంత అండగా నిలిచిన ‘ఐఎన్‌ఎస్‌ రాజ్‌పుత్’ నిష్క్రమణ నేడే

Internet Explorer: ఇక నిలిచిపోనున్న మైక్రోసాఫ్ట్‌ ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ సేవలు.. ఎప్పటి నుంచి అంటే..!

CoviSelf corona test: ఇంటి వద్దే కోవిడ్‌ పరీక్ష.. 5 నిమిషాల్లోనే ఫలితం.. అందుబాటులోకి మైలాబ్ కోవిడ్ సెల్ఫ్ టెస్టింగ్ కిట్