ఇటీవల వరుసగా స్మార్ట్ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోన్న చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్‌మీ తాజాగా భారత మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. ఇటీవల తీసుకొచ్చిన రెడ్‌మీ ఏ1కు కొనసాగింపుగా రెడ్‌మీ ఏ1 ప్లస్‌గా ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. అక్టోబర్ 14వ తేదీన విడుదల చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను బడ్జెట్ ధరలో తీసుకొచ్చారు. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 7500గా ఉంది. బడ్జెట్ తక్కువే అయినా ఫీచర్ల విషయంలో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా మంచి ఫీచర్లను అందించారు. ఇంతకీ రెడ్‌మీ ఏ1 ప్లస్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? ధర ఎంత లాంటి వివరాలు మీకోసం..
రెడ్‌మీ ఏ1 స్మార్ట్‌ఫోన్‌లో 6.52 హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 5000 ఎమ్‌ఏహెచ్‌తో కూడిన పవర్ ఫుల్ బ్యాటరీని అందించారు. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్‌లో 20 ప్రాంతీయ భాషలను అందించారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 8 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.
ఈ స్మార్ట్ ఫోన్‌ను బ్లాక్, లైట్ గ్రీన్, లైట్ బ్లూ కలర్స్‌లో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ 2 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ. 7499 కాగా, 3 జీబీ వేరియంట్ ధర రూ. 8,499గా ఉంది. ఈ ఫోన్ తొలి సేల్‌లో భాగంగా అక్టోబర్ 17వ తేదీన ఫ్లిప్‌కార్ట్‌తో పాటు రెడ్‌మీ స్టోర్‌లలో అందుబాటులోకి రానుంది. అక్టోబర్ 31వ తేదీ వరకు డిస్కౌంట్‌లో లభించనుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..