స్మార్ట్‌ఫోన్‌కు ప్రధానమైన శత్రువు ఏదైనా ఉందంటే అది ఛార్జింగ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతీ అవసరానికి ఒక యాప్ అందుబాటులోకి వచ్చిన తరుణంలో స్మార్ట్‌ఫోన్ వినియోగం అనివార్యంగా మారింది. దీంతో ఛార్జింగ్ త్వరగా తగ్గడం వంటి సమస్యను ఎదుర్కొంటున్నారు. దీంతో కంపెనీలు ఛార్జింగ్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. త్వరగా బ్యాటరీ ఫుల్ అయ్యే టెక్నాలజీతో యూజర్లను ఆకట్టుకుంటున్నారు. నిమిషాల్లోనే పూర్తి చార్జ్ అయ్యే హై కెపాసిటీ చార్జర్‌లు, కంపటబుల్ స్మార్ట్ ఫోన్లు చాలా వరకు మార్కెట్లో లాంచ్ అయ్యాయి.
ఈ క్రమంలోనే చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్‌మీ సైతం ఓ అధునాతన ఛార్జర్‌ను తీసుకొస్తోంది. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో 300W చార్జింగ్ టెక్నాలజీని లాంచ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రటించింది. 4100 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ కేవలం 5 నిమిషాల్లోనే 100 శాతం ఛార్జింగ్ కావడం ఈ ఛార్జర్ ప్రత్యేకగా చెప్పొచ్చు. దీనికి సంబంధించిన డెమో వీడియోను సైతం కంపెనీ ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. ఈ కొత్త చార్జింగ్ టెక్నాలజీకి 300W ఇమ్మోర్టల్ సెకండ్ ఛార్జర్ అనే పేరు పెట్టారు.
Redmi 300 watt charging will fully charge 4100mAh battery in 5 minutes. pic.twitter.com/EnH3VHFbT9
— Abhishek Yadav (@yabhishekhd) February 28, 2023
అయితే ఈ ఛార్జర్ మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందన్న దానిపై మాత్రం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలా ఉంటే కొన్ని రోజుల క్రితం రియల్‌మీ జీటీ నియో5 పేరుతో ఓ ఫోన్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో 240W చార్జింగ్ టెక్నాలజీని పరిచయం చేశారు. ఇది కేవలం 9 నిమిషాల 30 సెకన్లలో 0% నుంచి 100%, కేవలం 4 నిమిషాల్లో 0% నుంచి 50% వరకు చార్జ్ అవుతుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..