
కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా? అది కూడా బడ్జెట్ ధరలో కావాలా.. అయితే కచ్చితంగా ఈ ఫోన్ గురించి తెలుసుకోవాల్సిందే.
7000mAh బ్యాటరీతో లాంచ్ అయిన Redmi 15 5G ఫోన్ ధర ఇప్పుడు భారీగా తగ్గింది. ఈ ఫోన్‌ను అమెజాన్‌లో దాని లాంచ్ ధర కంటే రూ.2,000 తక్కువకు కొనుగోలు చేయవచ్చు. అదనంగా ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ Redmi ఫోన్‌లో EV-గ్రేడ్ సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఉంది. 50MP కెమెరా, 8GB వరకు RAMతో వస్తుంది.
రెడ్‌మి 15 5G మూడు స్టోరేజ్ వేరియంట్‌లలో లభిస్తుంది. 6GB RAM + 128GB, 8GB RAM + 128GB, 8GB RAM + 256GBలో అందుబాటులో ఉంది. ప్రారంభ ధర రూ.16,999. ధర తగ్గింపు తర్వాత, బేస్ మోడల్ ఇప్పుడు రూ.14,999లకే లభిస్తుంది. మిగిలిన రెండు వేరియంట్‌ల ధర వరుసగా రూ. 15,999, రూ. 16,999. ఈ ఫోన్ మూడు కలర్స్‌లో లభిస్తుంది. శాండీ పర్పుల్, ఫ్రాస్ట్ వైట్, మిడ్‌నైట్ బ్లాక్. మీరు రెడ్‌మి 15 5Gని రూ.727 నుండి ప్రారంభమయ్యే EMI ప్లాన్‌తో కూడా కొనుగోలు చేయవచ్చు. ఇది అమెజాన్, రెడ్‌మి అధికారిక స్టోర్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది. ఇక్కడ నో-కాస్ట్ EMI, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి