చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Xiaomi తన చౌకైన Redmi 14C 5G స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 9,999 (4GB RAM + 64GB) నుండి ప్రారంభమవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వెబ్‌సైట్, ఇ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, కొన్ని స్టోర్‌లలో జనవరి 10 నుండి అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్టార్‌డస్ట్ పర్పుల్, స్టార్‌గేజ్ బ్లాక్, స్టార్‌లైట్ బ్లూ కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది. అలాగే, ఇది డ్యూయల్ 5G సిమ్‌ను సపోర్ట్ చేస్తుంది.
ఈ మొబైల్ 6.88 అంగుళాల HD + డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 600 nits బ్రైట్‌నెస్, 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో Qualcomm Snapdragon 4 Gen 2 ప్రాసెసర్ సిస్టమ్ ఆన్ చిప్‌తో ఉంటుంది. Android 14 ఆధారంగా Xiaomi Hyper OSలో నడుస్తుంది. ఇది నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్ ఉంటుంది. దుమ్ము, నీటి నుండి రక్షణ కోసం IP52 రేటింగ్ పొందింది. ఈ స్మార్ట్‌ఫోన్ 4GB RAM + 64GB స్టోరేజ్, 6GB + 128 GB స్టోరేజ్ వేరియంట్‌లతో మార్కెట్‌లో అందుబాటులో ఉంటుంది.
కెమెరా ఫీచర్లు
కెమెరా ఫీచర్లను పరిశీలిస్తే, Redmi 14C 5G లో ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్స్. అదే సమయంలో సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ కెమెరా అందించింది. ఫోన్‌లో నైట్, హెచ్‌డిఆర్ మోడ్ అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా 5160 mAh బ్యాటరీని ఉంటుంది. ఫోన్ ఛార్జింగ్ కోసం USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. అలాగే, స్మార్ట్‌ఫోన్‌తో బాక్స్‌లో 33W ఛార్జర్ అందుబాటులో ఉంది.
ధర
Redmi 14C 5G వెనుక భాగం గాజుతో తయారు చేసి ఉంటుంది.ఇది ప్రీమియం రూపాన్ని ఇస్తుంది. 4GB RAM + 64GB స్టోరేజ్ ధర రూ.9,999, 4GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ.10,999, 6GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ.11,999. స్మార్ట్‌ఫోన్‌లో స్పీకర్లు, హెడ్‌ఫోన్‌లను కనెక్ట్ చేయడానికి జాక్, వేగవంతమైన ఇంటర్నెట్ కోసం డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.0, ఫింగర్ ప్రింట్ స్కానర్; A4 వంటి వర్చువల్ ప్రాక్సిమిటీ సెన్సార్‌ను కలిగి ఉంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి