స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో చాలా పోటీ ఉంది. పదుల సంఖ్యలో కంపెనీలు, వేల కొలదీ మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో తక్కువ బడ్జెట్ నుంచి అత్యంత ఖరీదైన ఫోన్ల వరకూ అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా చైనా ఫోన్లంటే తక్కువ ధరకేలభిస్తాయని అందరూ అనుకుంటారు. మన దేశంలో రెడ్‌మీ, రియల్‌మీ వంటి చైనా బ్రాండ్లు చాలా పాపులర్ అయ్యాయి. వీటిల్లో తక్కువ ధర నుంచి ఎక్కువ ధరకు లభించే మోడళ్లు చాలానే ఉన్నాయి. ఈ క్రమంలో రియల్‌మీ సంస్థ మరో స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ప్రీమియం ధరలో ఈ స్మార్ట్ ఫోన్‌ను రియల్‌మీ తీసుకొచ్చింది. దీని పేరు రియల్‌మీ జీటీ5. దీనిలో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్ ఉంటుంది. నమ్మశక్యం కాని వేగవంతమైన 240వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంది. అత్యాధునిక ఫీచర్లు ఇందులో సమకూర్చారు. ఈ రియల్‌మీ జీటీ5 స్మార్ట్ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ స్మార్ట్‌ఫోన్లో 144హెర్జ్ అధిక రిఫ్రెష్ రేట్‌తో గణనీయమైన పిక్చర్ క్వాలిటీని అందించే 6.7-అంగుళాల ఓఎల్ఈడీ స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ 2160హెర్జ్ వద్ద అధునాతన పీడబ్ల్యూఎం డిమ్మింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. గరిష్ట బ్రైట్ నెస్1400 నిట్‌ల వరకు చేరుకోగలదు. దీనిలో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్ అందించారు. దీనిలో ఏకంగా 24జీబీ ర్యామ్ ఉంటుంది. చేయబడింది. మల్టీ టాస్కింగ్ కు బాగాఉపయోగపడుతుంది. అలాగే గేమింగ్ ప్రియులకు అద్భుతమైన అనుభూతినిస్తుంది. పిక్సెల్‌వర్క్స్ ఐఆర్ఎక్స్ గేమింగ్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.
మూడు వేరియంట్లు.. రియల్‌మీ జీటీ5 మూడు విభిన్న వేరియంట్‌లలో వస్తుంది. మొదటిది 12జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ను అందిస్తుంది. రెండవది 16జీబీ ర్యామ్, 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. మూడో వేరియంట్ 24జీబీ ర్యామ్,1టీబీ నిల్వను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. సెప్టెంబర్ 4వ తేదీ నుంచి చైనాలో ప్రీ ఆర్డర్లకు అందుబాటులో ఉంటుంది.
కెమెరా సెటప్.. రియల్‌మీ జీటీ5 ఫోన్లో ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ట్రిపుల్-కెమెరా సెటప్ ఉంటుంది. 50ఎంపీ సోనీ ఐఎంఎక్స్890 ప్రధాన కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 8ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా, 2ఎంపీమాక్రో కెమెరాతో ఉంటుంది. ముందు వైపు, అద్భుతమైన సెల్ఫీలను తీయడానికి రూపొందించబడిన 16ఎంపీ వైడ్ కెమెరా ఉంది.
బ్యాటరీ సామర్థ్యం.. రియల్‌మీ జీటీ5 స్మార్ట్ ఫోన్లో 4600ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. దీనిలో ఏకంగా 240వాట్ల సామర్థ్యంతో కూడిన ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంటుంది. దీంతో బ్యాటరీని కేవలం 9 నిమిషాల్లో పూర్తిగా చార్జ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది. దీనిలో 5240ఎంఏహెచ్ బ్యాటరీతో మరొక వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇది 150వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
రియల్‌మీ జీటీ5 ధర.. మన భారతీయ మార్కెట్లో రియల్‌మీ జీటీ5 12జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ. 35,000, 16జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ. 37,000, 240W ఛార్జింగ్‌తో కూడిన హై-ఎండ్ 24జీబీ ర్యామ్ వేరియంట్ ధర దాదాపు రూ. 43,000 ఉంటుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..