Plane Light Dim: విమానం గాల్లో ఎగరడంలో ఎంతో టెక్నాలజీ దాగి ఉంది. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కొత్త కొత్త సదుపాయాలు మానవునికి అందుబాటులోకి వస్తున్నాయి. అయితే విమాన ప్రయాణం చేసే వారు చాలా మందే ఉంటారు. ప్రయాణ ఖర్చు కాస్త ఎక్కువైనా.. ఒక్కసారైన విమానంలో ప్రయాణించాలని చాలా మందికి ఉండే ఒక కల. ఇలాంటి కలలను చాలా మంది రుజువు చేసుకుంటారు. ఇక విమానం టేకాఫ్ అయినప్పుడు లైట్స్ డిమ్ అవడాన్ని మీరు గమనించి ఉంటారు. అయితే ఫ్లైట్ టేకాఫ్ , ల్యాండింగ్ సమయంలో లైట్లు ఎందుకు డిమ్ అవుతాయి ..? దీనికి కారణం కూడా ఉంది. విమానం టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో లైట్లు డిమ్ చేయబడతాయి. ఎందుకంటే మన కళ్లు కాంతికి అనుగుణంగా ఇలా చేస్తారు. కళ్లకు ఎఫెక్ట్ కాకుండా లైట్లను డిమ్ చేస్తారని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. కాంతి నుంచి చీకటికి లేదా చీకటి నుంచి కాంతికి సర్దుబాటు కావడానికి మన కళ్లు 10 నుంచి 30 నిమిషాల సమయం పడుతుంది. కానీ కాంతి మసకబారితే కళ్లకు కాంతిని సర్దుబాటు చేసేందుకు తక్కువ సమయం పడుతుంది. అందుకే లైట్ల కాంతిని తగ్గిస్తారు.
టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో ప్రమాదాలు ఎక్కువగా జరగడం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాము. అందుకే ఎమర్జెన్సీ డోర్లు, ఎగ్జిట్ లైటింగ్ సులువుగా కనిపించేలా ముందుగానే లైట్లను డిమ్ చేస్తారు. 2006, 2017 మధ్య బోయింగ్ ఎయిర్‌లైన్ అనుభవ వివరాల ప్రకారం.. టేకాఫ్ అయిన మొదటి 3 నిమిషాల్లోనే 13 శాతం ప్రమాదాలు జరిగాయి. ల్యాండింగ్‌కు 8 నిమిషాల ముందు 48 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి