త్వరలోనే వాట్సాప్ నుంచి చెల్లింపుల సేవలు..!

వాట్సాప్ నుంచి చెల్లింపుల సేవలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. డేటాను భారత్‌లోనే నిల్వ చేస్తామని వాట్సాప్ చెప్పడంతో.. కీలక అడ్డంకి తొలగినట్లుగా భావించాలి. ఇక చెల్లింపుల కోసం ముందుగా ICICIతో ఒప్పందం చేసుకుని ఆ తర్వాత AXIS, HDFC, SBIకి విస్తరించనుంది. ఏడాది క్రితమే పైలట్ ప్రాజెక్టుగా కొందరికి సేవలను అందుబాటులోకి తెచ్చినా.. డేటా నిల్వ పై మినహాయింపు ఇవ్వాలన్న వినతిని RBI తిరస్కరించడంతో సేవలు అమలు కాలేదు. అమెరికన్ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్‌లో భాగమైన […]

త్వరలోనే వాట్సాప్ నుంచి చెల్లింపుల సేవలు..!
Follow us

| Edited By:

Updated on: Jun 28, 2019 | 12:51 PM

వాట్సాప్ నుంచి చెల్లింపుల సేవలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. డేటాను భారత్‌లోనే నిల్వ చేస్తామని వాట్సాప్ చెప్పడంతో.. కీలక అడ్డంకి తొలగినట్లుగా భావించాలి. ఇక చెల్లింపుల కోసం ముందుగా ICICIతో ఒప్పందం చేసుకుని ఆ తర్వాత AXIS, HDFC, SBIకి విస్తరించనుంది. ఏడాది క్రితమే పైలట్ ప్రాజెక్టుగా కొందరికి సేవలను అందుబాటులోకి తెచ్చినా.. డేటా నిల్వ పై మినహాయింపు ఇవ్వాలన్న వినతిని RBI తిరస్కరించడంతో సేవలు అమలు కాలేదు.

అమెరికన్ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్‌లో భాగమైన వాట్సాప్ 2018లోనే ప్రయోగాత్మకంగా పరిమిత సంఖ్యలో యూజర్లకు పేమెంట్ సేవలు అందించడం ప్రారంభించింది. గతేడాది ఫిబ్రవరిలో ఐసీఐసీఐ బ్యాంక్ భాగస్వామ్యంతో తమ యాప్‌‌‌లో పేమెంట్స్ ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. అయితే దీనిపై వివాదం రేగింది. నియంత్రణ సంస్థ ఆదేశాలకు విరుద్దంగా డేటాను భారత్‌లో కాకుండా విదేశాల్లో భద్రపరచడం, యూజర్ల డేటా భద్రత పై అనుమానాలు, వాట్సాప్‌లో తప్పుదోవ పట్టించే వార్తలు వైరల్‌గా మారుతుండటం తదితర అంశాలు ఈ ప్రాజెక్టుకు ప్రతిబంధకాలుగా మారాయి. అయితే, ప్రధానమైన డేటా లోకలైజేషన్‌ అంశంతో పాటు ఇతరత్రా సమస్యలన్నింటినీ వాట్సాప్‌ పరిష్కరించుకోవడంతో పూర్తి స్థాయిలో సేవలు ప్రారంభించేందుకు మార్గం సుగమం అవుతుందని పరిశ్రమ వర్గాలు తెలుపుతున్నాయి.

Latest Articles
ఐస్ క్రీం తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని తినకండి..
ఐస్ క్రీం తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని తినకండి..
చింతపండు బస్తాలే అనుకున్నారు.. లోపల చెక్ చేయగా...
చింతపండు బస్తాలే అనుకున్నారు.. లోపల చెక్ చేయగా...
పోలా..అదిరిపోలా..4 చక్రాలతో ఎలక్ట్రిక్ బైక్.. వీడియో చూస్తే ఫిదా
పోలా..అదిరిపోలా..4 చక్రాలతో ఎలక్ట్రిక్ బైక్.. వీడియో చూస్తే ఫిదా
జాబ్‌ కోసం ప్రయత్నించి ఫెయిల్ అయిన యువతి నేడు సక్సెస్‌కు చిరునామా
జాబ్‌ కోసం ప్రయత్నించి ఫెయిల్ అయిన యువతి నేడు సక్సెస్‌కు చిరునామా
ఏపీ కొత్త డీజీపీగా ఆయనకు అవకాశం..? రేసులో నలుగురు ఐపీఎస్‎లు..
ఏపీ కొత్త డీజీపీగా ఆయనకు అవకాశం..? రేసులో నలుగురు ఐపీఎస్‎లు..
నేను చనిపోయానంటూ వార్తలు పుట్టించారు..
నేను చనిపోయానంటూ వార్తలు పుట్టించారు..
ఈ హైవేను నిర్మించిన తీరుపై ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యం
ఈ హైవేను నిర్మించిన తీరుపై ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యం
బయటకు వెళ్లి ఏం తినేటట్టు లేదు.. చివరికి ఐస్ క్రీం కూడా
బయటకు వెళ్లి ఏం తినేటట్టు లేదు.. చివరికి ఐస్ క్రీం కూడా
ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.. నేటి రాశి ఫలాలు
ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.. నేటి రాశి ఫలాలు
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ రిలీజ్
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ రిలీజ్