One Plus Nord CE2: వన్‌ప్లస్ బ్రాండ్ పేరు వినగానే భారీ బడ్జెట్ ఫోన్‌లే మదిలో మెదులుతాయి. ఈ బ్రాండ్ నుంచి విడుదలయ్యే ఫోన్‌లన్నీ ఎక్కువ ధరలో ఉంటాయనే అభిప్రాయం ఉంటుంది. అయితే ఇటీవల తక్కువ బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ల తయారీపై వన్‌ప్లస్ గురిపెట్టింది. వరుసగా లో బడ్జెట్ ఫోన్‌లను లాంచ్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా వన్‌ప్లస్ నార్డ్ సీఈకు కొనసాగింపుగా వన్‌ప్లస్ నార్డ్ సీఈ2లైట్‌ను తీసుకొచ్చే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సమాచారం.
గతేడాది విడుదల చేసిన 5జీ బడ్జెట్ ఫోన్‌కు కొనసాగింపుతా ఈ స్మార్ట్ ఫోన్‌ను తీసుకురానున్నారు. ఇక ఈ ఫోన్ ధర విషయానికొస్తే రూ. 20 వేల నుంచి మొదలు కానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ ఫోన్‌కు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ ఈ ఫోన్ ఫీచర్లు ఇవేనంటటూ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోన్న వార్తల ఆధారంగా ఈ ఫోన్‌లో ఉండే ఫీచర్లు ఇవే.. 6.59 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ప్లూయిడ్ డిస్‌ప్లేను అందించనున్నట్లు సమాచారం.
ఇక ఆండ్రాయిడ్ 12 ఆక్సిజెన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్‌తో పనిచేయనుంది. కెమెరా విషయానికొస్తే ఇందులో 64 మెగాపిక్సెల్‌తో పాటు 2, 2 ఎంపీలతో కూడిన రెయిర్ ట్రిపుల్ కెమెరా, సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీతో కూడిన 33 వాట్స్ ఛార్జ్ సపోర్ట్ చేయనుంది.
Also Read: Anantapur district: విదేశీయుడికి తెలుగువారి మంచి మనసు చాటి చెప్పిన ఆటోడ్రైవర్..
Facebook: ఫేస్‌బుక్‌కు చెమటలు పట్టిస్తున్న టిక్‌టాక్, యూట్యూబ్.. విషయం ఏంటంటే..?